ఏపీ పోలీసులకు క్రీడల్లో జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది: డీజీపీ
ABN , Publish Date - Sep 01 , 2026 | 05:29 PM
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత తొలిసారిగా పోలీసు స్పోర్ట్ మీట్ జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వ్యాఖ్యానించారు. పోలీసు ఉద్యోగం చేసేవారు 24 గంటలూ అలర్ట్‌గా ఉండాలని ఆదేశించారు.
అమరావతి, సెప్టెంబర్ 1 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఏపీ విభజన తర్వాత తొలిసారిగా పోలీసు స్పోర్ట్ మీట్ జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా (AP DGP Harish Kumar Gupta) వ్యాఖ్యానించారు. పోలీసు ఉద్యోగం చేసేవారు 24 గంటలూ అలర్ట్‌గా ఉండాలని ఆదేశించారు. పోలీసు ఉద్యోగం నిత్యం అనేక సవాళ్లతో కూడుకున్న పని అని తెలిపారు. ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌ను డీజీపీ ఈరోజు (మంగళవారం) ప్రారంభించి, మాట్లాడారు. పోలీసులకు క్రీడల పట్ల కూడా అంత ఆసక్తి కనబరిచే సమయం ఉండదని.. కానీ క్రీడల వల్ల మెంటల్, ఫిజికల్ ఫిట్‌నెస్ వస్తోందని వివరించారు.
క్రీడలు ఆడటం ద్వారా ఎన్నో ప్రయోజనాలు..
ఇప్పుడు ఇలా అందరూ కలిసి క్రీడల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని డీజీపీ చెప్పారు. ఇక్కడ పోటీల్లో గెలవాలని చాలా కష్టపడతారని, ఆలోచన చేస్తారని అన్నారు. ఇదే విధంగా విధుల్లో కూడా అనేక సవాళ్లను ఎదుర్కొని ఆయా కేసులు చేధించేలా పని చేయాలని దిశానిర్దేశం చేశారు. నిత్యం క్రీడలు ఆడటం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు. పోలీసులు వృత్తి రీత్యా ఎంత బిజీగా ఉన్నా... క్రీడల్లో రాణించేలా పాల్గొనాలని సూచించారు.
క్రీడల్లో ఏపీకి మరింత గుర్తింపు రావాలి..
ఏపీ పోలీసులకు క్రీడల్లో జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందని డీజీపీ కొనియాడారు. గతంలో అనేక పతకాలు వచ్చినా, భవిష్యత్తులో రాష్ట్ర పోలీసులు సాధించే విజయాలతో ఏపీకి క్రీడల్లో మరింత గుర్తింపు రావాలని సూచించారు. యువత కూడా చదువు, ఉద్యోగాలతో పాటు క్రీడల్లో రాణించాలని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ హయాంలో వెలిగొండ ప్రాజెక్ట్‌కు గ్రహణం పట్టింది: సీఎం చంద్రబాబు
పవన్ కల్యాణ్ ఆదేశాలు.. ఏపీలో పర్యావరణ పరిరక్షణకు స్పెషల్ డ్రైవ్
రోశయ్య స్ఫూర్తితో యువత రాజకీయాల్లోకి రావాలి: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News