Share News

చిన్నారుల భద్రత కోసం పటిష్ట చర్యలు: డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా

ABN , Publish Date - Feb 26 , 2026 | 06:30 PM

సురక్షిత బాల్యంతోనే సుస్థిర భవిష్యత్తు ఉంటుందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వ్యాఖ్యానించారు. ఏపీ వ్యాప్తంగా 'ఆపరేషన్ చిన్నారి తల్లి' ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించినట్లు తెలిపారు.

చిన్నారుల భద్రత కోసం పటిష్ట చర్యలు: డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా
AP DGP Harish Kumar Gupta

అమరావతి, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): సురక్షిత బాల్యంతోనే సుస్థిర భవిష్యత్తు ఉంటుందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వ్యాఖ్యానించారు. ఏపీ వ్యాప్తంగా 'ఆపరేషన్ చిన్నారి తల్లి' ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన 'ఆపరేషన్ చిన్నారి తల్లి' పోస్టర్‌ను మంగళగిరి డీజీపీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా డీజీపీ మీడియాతో మాట్లాడారు.


లైంగిక నేరాల నివారణే లక్ష్యంగా చర్యలు..

చిన్నారులపై లైంగిక నేరాల నివారణే లక్ష్యంగా చర్యలు చేపట్టామని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. పోక్సో కేసుల్లో జీరో పెండెన్సీ - 60 రోజుల్లో ఛార్జ్‌షీట్లు, స్పీడ్ ట్రయిల్ మానిటరింగ్ ద్వారా శిక్షల శాతం పెంచుతున్నామని తెలిపారు. తరచూ లైంగిక నేరాలకు పాల్పడే వారిపై సెక్సువల్ ఆఫెండర్స్ షీట్స్ (SOS) నమోదు చేస్తున్నామని స్పష్టం చేశారు. సున్నిత ప్రాంతాల్లో పటిష్టమైన రాత్రి గస్తీ నిర్వహిస్తున్నామని తెలిపారు. పాఠశాలలు, అంగన్వాడీలు, హాస్టళ్లలో ‘గుడ్ టచ్ - బ్యాడ్ టచ్’లపై అవగాహన కార్యక్రమాలు... చిన్నారుల తల్లులను అప్రమత్తం చేస్తున్నామని వివరించారు. బాధితులకు కౌన్సిలింగ్, పునరావాస సహాయం కల్పిస్తున్నామని చెప్పుకొచ్చారు. మహిళలు, చిన్నారుల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పోలవరం - నల్లమల సాగర్‌తో తెలుగు రాష్ట్రాలకు లాభం: సీఎం చంద్రబాబు

డయేరియా ప్రబ‌ల‌కుండా ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 26 , 2026 | 06:31 PM