Share News

డయేరియా ప్రబ‌ల‌కుండా ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు

ABN , Publish Date - Feb 26 , 2026 | 04:57 PM

మున్సిపాలిటీల్లో డయేరియా ప్రబ‌ల‌కుండా ముందస్తు జాగ్రత్తల కోసం ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. కలుషితం కాని, సురక్షితమైన తాగునీరు ప్రజ‌ల‌కు అందించేలా మున్సిప‌ల్ శాఖ‌ SOP జారీ చేసింది. ఈ మేరకు మున్సిప‌ల్ శాఖ ముఖ్య కార్యద‌ర్శి సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

డయేరియా ప్రబ‌ల‌కుండా ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు
AP Government

అమరావతి, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): మున్సిపాలిటీల్లో డయేరియా ప్రబ‌ల‌కుండా ముందస్తు జాగ్రత్తల కోసం ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. కలుషితం కాని, సురక్షితమైన తాగునీరు ప్రజ‌ల‌కు అందించేలా మున్సిప‌ల్ శాఖ‌ SOP జారీ చేసింది. ఈ మేరకు మున్సిప‌ల్ శాఖ ముఖ్య కార్యద‌ర్శి సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపాలిటీల్లో తాగునీరు కలుషిత‌మైతే ఆయా మున్సిపల్ కమిషనర్లను ఉపేక్షించేది లేదంటూ హుకుం జారీ చేశారు. అన్ని మున్సిపాలిటీల్లో తాగునీటి పైపులైన్లు తనిఖీ చేయాలని కమిషనర్లకు దిశానిర్దేశం చేశారు.


డ్రైనేజీల గుండా ఎక్కడైనా డ్రింకింగ్ వాటర్ పైప్‌లైన్లు వెళ్తున్నట్లయితే వెంటనే మార్చాలని సూచించారు. డ్రైనేజీల్లో నీరు నిలవకుండా వెంటనే చర్యలు చేపట్టాలని మార్గనిర్దేశం చేశారు. తాగునీటిపై ఫిర్యాదులు, సీజ‌న‌ల్ వ్యాధులపై 24 గంటలు పని చేసేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తాగునీటి స‌ర‌ఫ‌రా, డ్రెయిన్ల క్లీనింగ్‌లో అశ్రద్ద వ‌హిస్తే మున్సిపల్ కమిషనర్లు క్షేత్రస్థాయి సిబ్బందిని బాధ్యులను చేస్తామని స్పష్టం చేశారు. వార్డు సెక్రటరీలు, శానిటేషన్ సెక్రటరీ క్షేత్రస్థాయి తనిఖీల్లో పాల్గొనాలని దిశానిర్దేశం చేశారు. త‌క్షణ‌మే ఆదేశాలు అమ‌ల‌య్యేలా చూడాలంటూ మున్సిప‌ల్ శాఖ ముఖ్య కార్యద‌ర్శి సురేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పోలవరం - నల్లమల సాగర్‌తో తెలుగు రాష్ట్రాలకు లాభం: సీఎం చంద్రబాబు

ప్రభుత్వ బడికి సరికొత్త రూపం తెచ్చారు.. ఆ మాస్టారుపై లోకేశ్ ప్రశంసలు

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 26 , 2026 | 05:38 PM