Share News

ప్రభుత్వ బడికి సరికొత్త రూపం తెచ్చారు.. ఆ మాస్టారుపై లోకేశ్ ప్రశంసలు

ABN , Publish Date - Feb 25 , 2026 | 07:08 PM

సత్యనారాయణ మాస్టరుపై మంత్రి లోకేశ్ ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం తన సొంత నిధులు, దాతల సహాయంతో స్కూల్‌ను తీర్చిదిద్దారని కొనియాడారు.

ప్రభుత్వ బడికి సరికొత్త రూపం తెచ్చారు.. ఆ మాస్టారుపై లోకేశ్ ప్రశంసలు
AP Minister Nara Lokesh

అమరావతి, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా, జగ్గంపేట మండలం సగరపేటలో మోడ‌ల్ ప్రైమ‌రీ స్కూల్‌ ఎస్జీటీ పీవీవీ. సత్యనారాయణ మాస్టారు బ‌డి బాగు కోసం చేస్తున్న కృషి అభినంద‌నీయమని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) ప్రశంసలు కురిపించారు. సొంత నిధులు దాదాపు రూ.10 ల‌క్షలు, దాత‌ల విరాళాలు రూ.1.80 ల‌క్షల‌తో కార్పొరేట్ స్కూలుని త‌ల‌ద‌న్నేలా తీర్చిదిద్ది స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు.


పాఠశాల రూపురేఖలను పూర్తిగా మార్చేశారు..

క్లాసు రూమ్‌లో టైల్స్, గ్రౌండ్ ఫ్లోరింగ్, పెయింటింగ్, వాల్ రైటింగ్, కాంపౌండ్ వాల్ రంగుల‌తో కొత్తందాలు సంత‌రించుకునేలా చేశారని కీర్తించారు. నాలుగు కంప్యూట‌ర్లతో డిజిట‌ల్ క్లాస్ రూం, కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయ‌డం ప్రశంస‌నీయమని పేర్కొన్నారు. పాఠ‌శాల హెచ్ఎం, ఉపాధ్యాయుల స‌హ‌కారంతో వ‌చ్చే విద్యా సంవ‌త్సరంలో 64 మంది పిల్లలు కొత్తగా బ‌డిలో చేరుస్తున్న మీ అంకిత‌భావానికి హ్యాట్సాఫ్‌ అన్నారు. ఈ పాఠ‌శాల అభివృద్ధికి అన్నివిధాలా స‌హాయం అందిస్తున్న జ‌గ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకి హృద‌య‌పూర్వక అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నానని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హెరిటేజ్‌కి.. వీఎస్ఆర్ ఏవియేషన్‌కి ఎలాంటి సంబంధం లేదు: మంత్రి నారా లోకేశ్

వెలిగొండ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్..

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 25 , 2026 | 07:52 PM