Share News

వెలిగొండ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్..

ABN , Publish Date - Feb 25 , 2026 | 03:25 PM

వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

వెలిగొండ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్..
AP CM Chandrababu Naidu

మార్కాపురం, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ప్రత్యేక దృష్టి సారించారు. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇవాళ(బుధవారం) దోర్నాల మండలం గంటవానిపల్లి వద్ద వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులని పరిశీలించారు.


రూ.456 కోట్లతో ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్థానిక రైతులతో కలిసి ఫీడర్ కెనా‌ల్‌‌లో సీఎం చంద్రబాబు తిరిగారు. స్థానికంగా ఏఏ పంటలు పండిస్తున్నారో అన్నదాతలని అడిగి తెలుసుకున్నారు. లైనింగ్ పనుల గురించి అధికారులతో చర్చించారు. వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిలో వేగం పెంచాలని మార్గనిర్దేశం చేశారు.


అలాగే, వెలిగొండ రెండో టన్నెల్‌లో పని చేస్తున్న ఇంజనీర్స్‌తో లైవ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. టన్నెల్‌లో లైనింగ్ పనులని లైవ్‌లో పరిశీలించారు. జూన్ 15వ తేదీ నాటికి టన్నెల్‌లో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. జూన్ 15వ తేదీన వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభిస్తానని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. ప్రతి సోమవారం వెలిగొండ ప్రాజెక్టు పనులపై సమీక్షిస్తానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వర్ణాంధ్ర 2047 విజన్‌తో తలసరి ఆదాయం భారీగా పెంపు: సీఎం చంద్రబాబు

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఉద్యోగుల పనితీరు ఆధారంగా..

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 25 , 2026 | 03:37 PM