తూర్పు కనుమల్లో అరుదైన మొక్క
ABN , Publish Date - Jul 30 , 2026 | 07:22 AM
తూర్పు కనుమల్లోని ఉబ్బలమడుగు జలపాతం ప్రాంతంలో గుర్తించిన కొత్త రకం మొక్కకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ‘క్రో టన్ ఉబ్బలమడుగెన్సిస్’ అని నామకరణం చేశారు. తిరుపతి జిల్లా పరిధిలోని తూర్పు కనుమల్లో ఈ అరుదైన వృక్ష జాతి మొక్కను అటవీ అధికారులు గుర్తించారు.
‘క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్’గా డిప్యూటీ సీఎం నామకరణం: పీసీసీఎఫ్ చలపతిరావు
పరిశోధనలతో వెలుగులోకి..
అమరావతి, జూలై 29 (ఆంధ్రజ్యోతి): తూర్పు కనుమల్లోని ఉబ్బలమడుగు జలపాతం ప్రాంతంలో గుర్తించిన కొత్త రకం మొక్కకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ‘క్రో టన్ ఉబ్బలమడుగెన్సిస్’ అని నామకరణం చేశారు. తిరుపతి జిల్లా పరిధిలోని తూర్పు కనుమల్లో ఈ అరుదైన వృక్ష జాతి మొక్కను అటవీ అధికారులు గుర్తించారు. ఇది యూఫోర్బియేసీ కుటుంబానికి చెందినది. ఉబ్బలమడుగు జలపాతానికి సమీపంలోని కంబకం కొండల ప్రాంతం ఈ మొక్కకు సహజ ఆవాసంగా ఉండటంతో ఆ ప్రాంత పర్యావరణ ప్రాధాన్యాన్ని ప్రతిబింబించేలా పేరును ఖరారు చేశారు. రాష్ట్ర అటవీ ప్రధాన ముఖ్యసంరక్షణాధికారి పీవీ చలపతిరావు తన పరిశోధనా సహచరులతో కలసి, తూర్పు కనుముల్లో నిర్వహించిన విస్తృత వృక్షశాస్త్ర పరిశోధనల సందర్భంగా ఈ మొక్కను గుర్తించారు. అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జాతిగా పరిశోధకులు గుర్తించారు.
వార్తలు కూడా చదవండి...
చంద్రబాబు దూరదృష్టితో కుప్పంకు ఇజ్రాయిల్ టెక్నాలజీ: నారా భువనేశ్వరి
జీవ వైవిధ్య పరిరక్షణలో పులుల పాత్ర అమోఘం: పవన్ కల్యాణ్
ఏపీ మద్యం స్కాం.. కారుమూరికి సుప్రీంకోర్టులో షాక్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News