పిఠాపురంలో అగ్నిప్రమాదం.. పవన్ కల్యాణ్ విచారం
ABN , Publish Date - Nov 28 , 2026 | 03:50 PM
పిఠాపురం మండలం నరసింగపురం గ్రామంలో తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ పాడి రైతుకి చెందిన పశువులు, కోళ్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు.
అమరావతి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): పిఠాపురం మండలం నరసింగపురం గ్రామంలో తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ పాడి రైతుకి చెందిన పశువులు, కోళ్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలను కాకినాడ జిల్లా కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ధర్మారావుకు చెందిన తాటాకుల పాకలో అగ్నిప్రమాదం సంభవించగా, 7 గేదెలు, 6 దూడలు, సుమారు 30 కోళ్లు మృతి చెందినట్లు తెలిసిందని అన్నారు.
తాటాకుల పాకకు నిప్పు అంటుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పవన్ కల్యాణ్ చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారని అన్నారు. ఈ ఘటనలో పాడి రైతు తన జీవనాధారాన్ని కోల్పోవడం బాధ కలిగించిందని చెప్పుకొచ్చారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై తక్షణమే విచారణ జరిపి నివేదిక అందించాలని ఆదేశించారు. ఏపీ ప్రభుత్వం తరఫున బాధిత పాడి రైతుకు అండగా నిలిచేలా, పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు.
హరిహరనాథ్ ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కల్యాణ్
కృష్ణా జిల్లా డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్న యడ్లపల్లి హరిహరనాథ్ గుండెపోటుతో మృతిచెందారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. గత నెల రోజులుగా ఎన్నికల విధుల్లో నిమగ్నమైన ఆయన, మరో పదేళ్ల సర్వీసు మిగిలి ఉండగానే అకాల మరణం చెందడం దురదృష్టకరమని అన్నారు. 1999లో బంటుమిల్లి ఎంపీడీఓగా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన హరిహరనాథ్ 27 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారని తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మహిళా రిజర్వేషన్ల అమలుకు మోదీ సర్కార్ నయా ప్లాన్.. డీలిమిటేషన్ బిల్లులో కీలక మార్పులు
అమరావతి రైతులు చేసిన త్యాగాన్ని జగన్ అండ్ కో ఎగతాళి చేస్తున్నారు.. సీఎం చంద్రబాబు ధ్వజం
రాజకీయ విభేదాలకు అతీతంగా డీలిమిటేషన్ బిల్లుకు మద్దతివ్వాలి: పవన్ కల్యాణ్
Read Latest AP News And Telangana NewsAnd National News
And Telugu News