Share News

సీఎం చంద్రబాబు చెన్నై పర్యటన ఖరారు

ABN , Publish Date - Aug 18 , 2026 | 12:50 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు 19, 20 తేదీల్లో చెన్నైలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారైంది.

 సీఎం చంద్రబాబు చెన్నై పర్యటన ఖరారు
AP CM Chandrababu Naidu

అమరావతి, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ఆగస్టు 19, 20 తేదీల్లో చెన్నైలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారైంది. రేపు సాయంత్రం 5:30 గంటలకు విజయవాడ ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్లనున్నారు. ఆగస్టు 19వ తేదీ రాత్రి చెన్నైలోని తాజ్ ఫిషర్‌మ్యాన్స్ కోవ్ రిసార్ట్‌లో ముఖ్యమంత్రి బస చేయనున్నారు.


ఆగస్టు 20వ తేదీన ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు జరిగే 31వ 'సదరన్ జోనల్ కౌన్సిల్' (Southern Zonal Council) సమావేశంలో సీఎం పాల్గొననున్నారు. ఈ సమావేశం అనంతరం ఆగస్టు 20వ తేదీ సాయంత్రం 5:15 గంటలకు ఉండవల్లి నివాసానికి సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు.


వార్తలు కూడా చదవండి...

నా రాజకీయ జీవితంలో గ్రూప్ -1 లాంటి స్కాం చూడలేదు: సీఎం

అసెంబ్లీలో మంత్రుల సరదా సంభాషణ.. సత్యకుమార్‌పై లోకేశ్ చమత్కారం

ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా నాగబాబు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 18 , 2026 | 12:57 PM