చేనేతలకు సీఎం చంద్రబాబు శుభవార్త.. చీరాలలో ‘నేతన్న సేవలో’ నిధుల విడుదల
ABN , Publish Date - Aug 06 , 2026 | 07:50 PM
చేనేతలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ‘నేతన్న సేవలో’ పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.25 వేలు అందజేయనుంది.
అమరావతి, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): చేనేతలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ‘నేతన్న సేవలో’ పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.25 వేలు అందజేయనుంది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చీరాలలో నిధులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) విడుదల చేయనున్నారు. రూ.179 కోట్లతో 71,536 చేనేత కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.
చీరాలలో సీఎం చంద్రబాబు రేపు (శుక్రవారం) పర్యటించనున్నారు. వేటపాలెం మండలం కొత్తపేటలో చేనేత దినోత్సవం కార్యక్రమంలో పాల్గొననున్నారు. నేతన్న సేవలో పథకం ద్వారా చేనేతల ఖాతాలకు రూ.5 వేలు నగదు బదిలీ చేయనున్నారు. చీరాల మండలం జాండ్రపేటలో చేనేత మగ్గాలను పరిశీలించి లబ్ధిదారులతో ముఖాముఖిలో మాట్లాడనున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఉదయం 10:30 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్ ద్వారా కొత్తపేట బయలుదేరనున్నారు.
10:50లకు కొత్తపేటకు సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు. 11:05 నుంచి 12:35 వరకు ప్రజా వేదికలో పాల్గొంటారు. ప్రజా వేదిక సభలో ‘నేతన్న సేవలో’ పథకాన్ని ప్రారంభిస్తారు. చేనేతల ఖాతాలకు రూ.25 వేల చొప్పున నగదు బదిలీ చేస్తారు. 1:20లకు చీరాల మండలం జాండ్రపేటలో మగ్గాలను పరిశీలించి చేనేతలతో మాట్లాడుతారు. 2:30కి చీరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం సమీపంలో కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. 4.25కి కొత్తపేట నుంచి హెలికాప్టర్‌లో సీఎం చంద్రబాబు ఉండవల్లి బయలుదేరి వెళ్లనున్నారు.
వార్తలు కూడా చదవండి...
విశాఖ ఎకనామిక్ రీజియన్ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్
పవన్ కల్యాణ్ ఆదేశాలతో పులుల మరణాలపై అధికారుల ముమ్మర తనిఖీలు.. పట్టుబడ్డ పులిగోర్లు
ప్రపంచ స్థాయి క్రీడాకారులను పీవీ సింధు అకాడమీ తయారు చేస్తోంది: లోకేశ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News