Share News

టీడీపీకి నయా జోష్.. పలు నియోజకవర్గాల్లో ఇన్‌చార్జ్‌ల మార్పునకు సీఎం చంద్రబాబు కసరత్తు

ABN , Publish Date - Jul 11 , 2026 | 02:30 PM

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ సంస్థాగత బలోపేతంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. ఇందులో భాగంగానే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

టీడీపీకి నయా జోష్.. పలు నియోజకవర్గాల్లో ఇన్‌చార్జ్‌ల మార్పునకు సీఎం చంద్రబాబు కసరత్తు
AP CM Chandrababu Naidu

అమరావతి, జులై 11 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ సంస్థాగత బలోపేతంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) దృష్టి సారించారు. ఇందులో భాగంగానే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్ఠం చేయాలనే లక్ష్యంతో ఇప్పటికే మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త ఇన్‌చార్జ్‌లను నియమించిన అధినేత, మరో తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త ఇన్‌చార్జ్‌లను నియమించేందుకు కసరత్తు వేగవంతం చేశారు.


పలు నియోజకవర్గాలకు ప్రస్తుతం ఉన్న నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల మార్పుపైన సీఎం చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. ఇందులో భాగంగానే విశాఖపట్నం నార్త్, ఎచ్చెర్ల, పి. గన్నవరం, అనపర్తి, అవనిగడ్డ, విజయవాడ వెస్ట్, తంబళ్లపల్లి, పిఠాపురం, కైకలూరు నియోజకవర్గాల్లో కొత్త ఇన్‌చార్జ్‌లకు బాధ్యతలు అప్పగించనున్నారు. త్వరలో మరికొన్ని నియోజకవర్గాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ఇన్‌చార్జ్‌ల్లో పలు మార్పులు చేయాలని తెలుగుదేశం పార్టీ హైకమాండ్ భావిస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి...

ఎంఎస్ఎంఈలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

ఆ ఘటనపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సీరియస్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 11 , 2026 | 03:16 PM