ఆ ఘటనపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సీరియస్
ABN , Publish Date - Jul 09 , 2026 | 08:28 PM
విజయవాడ ప్రభుత్వాస్పత్రి ఘటనపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సీరియస్ అయ్యారు. మృతదేహాన్ని ప్రభుత్వ మహాప్రస్థానం అంబులెన్స్ ద్వారా స్వస్థలానికి చేర్చకపోవటానికి దారి తీసిన పరిస్థితులపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
విజయవాడ, జులై 9 (ఆంధ్రజ్యోతి): విజయవాడ ప్రభుత్వాస్పత్రి ఘటనపై మంత్రి సత్యకుమార్ యాదవ్ (AP Minister Satya Kumar Yadav) సీరియస్ అయ్యారు. మృతదేహాన్ని ప్రభుత్వ మహాప్రస్థానం అంబులెన్స్ ద్వారా స్వస్థలానికి చేర్చకపోవటానికి దారి తీసిన పరిస్థితులపై విచారణకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై విచారణ జరపాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ విష్ణువర్ధన్‌ను మంత్రి ఆదేశించారు. ఇటీవల జరిగిన ఈ సంఘటన గురించి తనకు తెలిసిన వెంటనే విజయవాడ జీజీహెచ్ అధికారులతో మంత్రి మాట్లాడారు.
మృతదేహాన్ని స్వస్థలానికి ప్రైవేట్ అంబులెన్స్‌లో తీసుకెళ్లారని, రాత్రి సమయంలో ఈ సంఘటన జరిగిందని ఆస్పత్రి అధికారులు చెప్పటంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాప్రస్థానం కింద అంబులెన్స్‌లు ఆస్పత్రిలో లేవా?, బాధ్యులు ఎవరు? అని ప్రశ్నించారు. మృతుని కుటుంబ సభ్యులు ఎందుకు ప్రైవేట్ అంబులెన్సును ఆశ్రయించాల్సి వచ్చిందో విచారణ జరిపి నివేదించాలని మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీల పెంపునకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం
మత విద్వేషాలను ప్రోత్సహిస్తున్నారు.. జగన్ అండ్ కోపై మంత్రి ఆనం ధ్వజం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News