Share News

ఎంఎస్ఎంఈలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

ABN , Publish Date - Jul 09 , 2026 | 06:10 PM

ఎంఎస్ఎంఈలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బకాయిల చెల్లింపు వివాదాల పరిష్కారానికి కీలక నిర్ణయం తీసుకుంది.

ఎంఎస్ఎంఈలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
AP Government

అమరావతి, జులై 9 (ఆంధ్రజ్యోతి): సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (MSME) ఏపీ ప్రభుత్వం (AP Government) గుడ్ న్యూస్ చెప్పింది. బకాయిల చెల్లింపు వివాదాల పరిష్కారానికి కీలక నిర్ణయం తీసుకుంది. ఫెసిలిటేషన్ కౌన్సిళ్ల పునర్వ్యవస్థీకరణకు జీవో నంబర్ -165 జారీ చేసింది. రెండేళ్ల కాలపరిమితితో కొత్త కౌన్సిళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మంగళగిరిలో ప్రధాన ఎంఎస్ఎంఈ ఫెసిలిటేషన్ కౌన్సిల్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.


ప్రధాన కౌన్సిల్‌కు పరిశ్రమల శాఖ కమిషనర్, చైర్మన్‌ను నియమించింది. రూ.50 లక్షలకుపైగా క్లెయిమ్‌లను ప్రధాన కౌన్సిల్ పరిష్కరించనుంది. రూ.50 లక్షల్లోపు వివాదాలకు నాలుగు ప్రాంతీయ కౌన్సిళ్లను ఏర్పాటు చేసింది. విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, కర్నూలులో ఈ కౌన్సిళ్లను ఏర్పాటు చేసింది. RAMP విధానానికి అనుగుణంగా ఆన్‌లైన్ ODR పోర్టల్ ద్వారా కేసులను పరిష్కరించనుంది. వివాదాల వేగవంతమైన పరిష్కారానికి 4 ప్రముఖ ADR కేంద్రాలను ఎంపిక చేసింది. వీటిలో హైదరాబాద్, చండీగఢ్, బెంగళూరు, విశాఖపట్నంల్లో ADR కేంద్రాల సేవలు అమల్లోకి రానున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి...

హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీల పెంపునకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం

మత విద్వేషాలను ప్రోత్సహిస్తున్నారు.. జగన్ అండ్ కోపై మంత్రి ఆనం ధ్వజం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 09 , 2026 | 06:49 PM