Share News

లోకేశ్‌, బుచ్చయ్య చౌదరి సరదా ముచ్చట.. ఏపీ అసెంబ్లీలో నవ్వుల వాతావరణం.!

ABN , Publish Date - Feb 13 , 2026 | 03:55 PM

ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడోరోజు ప్రారంభమయ్యాయి. శుక్రవారం సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం రాజమహేంద్రవరం రూరల్ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆప్యాయంగా చమత్కరించారు.

లోకేశ్‌, బుచ్చయ్య చౌదరి  సరదా ముచ్చట.. ఏపీ అసెంబ్లీలో నవ్వుల వాతావరణం.!

అమరావతి, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడోరోజు ప్రారంభమయ్యాయి. శుక్రవారం సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం రాజమహేంద్రవరం రూరల్ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆప్యాయంగా చమత్కరించారు. బుచ్చయ్య తాత అంటూ ఆప్యాయంగా పలకరించారు. లాబీల్లో బుచ్చయ్య ను ఆలింగనం చేసుకొని సరదాగా కబుర్లు చెప్పుకున్నారు.


పక్కనే ఉన్న మీడియా ప్రతినిధులకు చూపించి ఆయన కళ్లజోడు గోల్డ్, వాచ్ గోల్డ్, రింగ్ గోల్డ్, ఫోన్ గోల్డ్, పెన్ గోల్డ్ అంటూ ఛలోక్తులు విసిరారు. మనిషి కూడా గోల్డ్ అంటూ కితాబిచ్చారు. కానీ ఆయన వేసుకున్న షర్ట్ మాత్రం పూర్తి స్టైలిష్ షర్ట్ అని చమత్కరించారు. ఈలోపు వెనుక నుంచి మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందిస్తూ.. ‘ రాజకీయాల్లో బుచ్చయ్య గారు ఓల్డ్’ అంటూ చమత్కరించారు. దీంతో లోకేశ్ పక్కనే ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మె్ల్సీల ముఖాల్లో నవ్వులు విరబూశాయి. ఈ క్రమంలో లాబీల్లో కాసేపు సందడి వాతావరణం నెలకొంది.


ఈ వార్తలు కూడా చదవండి..

మహిళలంటే వైసీపీ నేతలకు గౌరవం లేదు.. జగన్ అండ్ కోపై లోకేశ్ ధ్వజం

జగన్ హయాంలో మద్యనిషేధం పేరుతో రేట్లు పెంచారు: మంత్రి కొల్లు రవీంద్ర

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 13 , 2026 | 04:17 PM