మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత: వంగలపూడి అనిత
ABN , Publish Date - May 10 , 2026 | 02:57 PM
మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. తల్లుల త్యాగాలను మరవొద్దని పేర్కొన్నారు. అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
కృష్ణా జిల్లా, మే 10 (ఆంధ్రజ్యోతి): మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) వ్యాఖ్యానించారు. తల్లుల త్యాగాలను మరవొద్దని పేర్కొన్నారు. అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు (ఆదివారం) కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గోశాల వృద్ధ మహిళల ఆశ్రమంలో మదర్స్ డే వేడుకల్లో అనిత, ఎమ్మెల్యే బోడేప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడారు. ఆ ఆశ్రమంలో ఎంతమందోకి ఆశ్రయం కల్పిస్తున్నారని చెప్పుకొచ్చారు. చాలామంది మాతృమూర్తులు వారి పిల్లలకు దూరంగా ఉన్నారని తెలిపారు. వాళ్లకు ఒక చిన్న ఆనందాన్ని ఇవ్వాలని, వాళ్లందరి దీవెనలు పంచుకోవాలని ఈ ఆశ్రమానికి తాను వచ్చానని అన్నారు.
వీళ్లందరి కళ్లలో కనిపిస్తున్న ఆనందం, వాసవి మహిళా మండలి నడుపుతున్న తీరు తనకు చాలా స్ఫూర్తిని ఇచ్చిందని హోంమంత్రి అనిత తెలిపారు. ఈ ఆశ్రమం తమదే అనే భావన వారిలో ఉందని చెప్పుకొచ్చారు. సమాజంలో తల్లికి ఇచ్చే గౌరవస్థానం ప్రపంచంలో ఎవరికీ లేదని వ్యాఖ్యానించారు. దేవుడు కూడా ప్రథమ స్థానాన్ని తల్లికే ఇచ్చారని ప్రస్తావించారు. అలాంటి తల్లులు ఎప్పుడూ ఇబ్బంది పడకూడదని సూచించారు. పిల్లలను కనిపెంచడానికి వాళ్లు ఎన్ని త్యాగాలు చేస్తారో అందరికీ తెలుసునని తెలిపారు. ఒక బిడ్డను కనడానికి తల్లి ఎంతగానో ప్రసవ వేదన పడుతోందని అన్నారు. అలాంటి తల్లులందరికీ ఒక ఆసరాగా నిలబడాల్సిన అవసరం మనందరిపై ఉందని చెప్పుకొచ్చారు. అందుకే ఈరోజు తన పిల్లలిద్దరినీ కూడా తీసుకువచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చేశానని తెలిపారు. మహిళల విషయంలో మంత్రి నారా లోకేశ్ చూపుతున్న స్ఫూర్తిని కూడా మనం ఆదర్శంగా తీసుకోవాలని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.
తల్లిని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది: ఎమ్మెల్యే బోడే ప్రసాద్
సమాజంలో తల్లిని గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. ఈ ఆశ్రమంలోని తల్లులందరిని ఒకసారి కలిసి వారి ప్రేమను పంచుకోవాలనే ఇక్కడికి వచ్చామని.. వారి కష్టసుఖాలు కూడా విన్నానని చెప్పుకొచ్చారు. ఈరోజు వృద్ధుల ఆశ్రమాలు ఎక్కువగా పెరుగుతున్నాయని.. ఆ అవసరం లేకుండా ప్రతి బిడ్డ కూడా తల్లిని చూసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రతి ఒక్కరూ కూడా మహిళలను గౌరవించాలని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
డీఎంకే ఓటమికి అవినీతి పాలనే కారణం: మంత్రి సత్యకుమార్
జగన్ అండ్ కో క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు.. ఎంపీ శ్రీ భరత్ ధ్వజం
సింగపూర్ మోడల్‌లో ఫిర్యాదుల పరిష్కారానికి సీఎం చంద్రబాబు ప్లాన్
Read Latest AP News And Telangana News And International News And Telugu News