అమరావతికి పెట్టుబడులు రాకుండా వైసీపీ కుట్రలు చేస్తోంది.. రైతుల ధ్వజం
ABN , Publish Date - Jun 28 , 2026 | 12:24 PM
అమరావతికి వైసీపీ సీఆర్డీఏ పరిరక్షణ కమిటీ రావడంతో జరిగిన ఘటనకు సంబంధించి రాజధాని రైతులు స్పందించారు. వైసీపీ వైఖరిని తీవ్రంగా ఖండించారు. అమరావతి అభివృద్ధిని అడ్డుకోవడమే వైసీపీ లక్ష్యమని ధ్వజమెత్తారు.
అమరావతి, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): అమరావతికి వైసీపీ సీఆర్డీఏ పరిరక్షణ కమిటీ రావడంతో జరిగిన ఘటనకు సంబంధించి రాజధాని రైతులు (Amaravati Farmers) స్పందించారు. వైసీపీ వైఖరిని తీవ్రంగా ఖండించారు. అమరావతి అభివృద్ధిని అడ్డుకోవడమే వైసీపీ లక్ష్యమని ధ్వజమెత్తారు. రాజధాని నిర్మాణాన్ని నిలిపివేయడానికి వైసీపీ నేతల కుట్రలు నేటికీ జరుగుతున్నాయని మండిపడ్డారు. ఈరోజు(ఆదివారం) అమరావతిలోని మందడంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాజధాని రైతులు పలు కీలక విషయాలు వెల్లడించారు. అన్నదాతల ప్రయోజనాలకు వైసీపీ నేతలు వ్యతిరేకంగా వ్యవహరించారని దుయ్యబట్టారు. అమరావతి అభివృద్ధి కొందరికి ఇష్టం లేదని చెప్పుకొచ్చారు. అమరావతిలో మాజీ మంత్రి పేర్ని నాని ఇతర వైసీపీ ముఖ్య నేతల పర్యటనపై తాము అభ్యంతరం తెలిపామని అన్నారు. తమను వైసీపీ రెచ్చగొట్టొద్దని హెచ్చరించారు. అవసరమైతే కొత్త తరహా ఉద్యమానికి తాము సిద్ధమని స్పష్టం చేశారు.
అమరావతి రైతులకు న్యాయం చేయాలి..
అమరావతి రైతులకు న్యాయం చేయాలని అన్నదాతలు డిమాండ్ చేశారు. దానికోసం రాజధాని అభివృద్ధిని అడ్డుకునే వైసీపీ ప్రయత్నాలను మానుకోవాలని హితవు పలికారు. వైసీపీ నాయకులు అధికారం ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో మరోలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అమరావతి అంశాన్ని రాజకీయాలకు వాడుకోవద్దని సూచించారు. మళ్లీ ఇలాంటి చర్యలు జరిగితే తీవ్ర ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే 10 వేల మంది రైతులతో తాడేపల్లి ప్యాలెస్‌ను, వైసీపీ కార్యాలయాలను ముట్టడిస్తామని వార్నింగ్ ఇచ్చారు. జగన్ హయాంలో మూడు రాజధానులతో ప్రజలను అయోమయంలోకి నెట్టారని ఆరోపించారు. అందుకే రాజధానికి వచ్చిన వైసీపీ బృందాన్ని తాము అడ్డుకున్నామని అన్నారు.1631 రోజుల ఉద్యమంలో వైసీపీ నాయకులు ఎందుకు తమను పరామర్శించలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు కవ్వింపు చర్యలు మానుకోవాలని డిమాండ్ చేశారు.
జగన్‌కు అమరావతిపై మాట్లాడే నైతిక హక్కు లేదు..
తమపై టీడీపీ వారు దాడి చేశారనే ఆరోపణలు అవాస్తవమని అమరావతి రైతన్నలు అన్నారు. రాజధాని నిర్మాణాన్ని వైసీపీ నేతలు అడ్డుకునే కుట్ర చేస్తోన్నారని ఆరోపించారు. జగన్‌కు అమరావతిపై మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు. సంఘీభావం పేరుతో రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. మహిళా రైతుల ప్రశ్నలకు జగన్ అండ్ కో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతి అంతర్జాతీయ స్థాయి రాజధానిగా అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ఐదేళ్లలో అమరావతికి ఎందుకు నిధులు కేటాయించలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. మూడు రాజధానుల పేరుతో అభివృద్ధిని వైసీపీ నేతలు అడ్డుకున్నారని ఆగ్రహించారు. అమరావతి రాజధానిని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. అమరావతికి పెట్టుబడులు రాకుండా వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అమరావతి అభివృద్ధి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. రాజధానిపై వైసీపీ కుట్రలు కొనసాగితే గట్టిగా బదులిస్తామని అమరావతి రైతులు హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
తప్పు ఎవరు చేసినా తప్పే.. కులం ఆధారంగా చూడొద్దు: పవన్ కల్యాణ్
‘రాజధాని ద్రోహి జగన్, గో బ్యాక్’ అంటూ అమరావతి రైతుల నినాదాలు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News