జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో ట్విస్ట్.. అనుమానాస్పదంగా కారు కదలికలు
ABN , Publish Date - Jul 06 , 2026 | 09:44 PM
కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో చిన్నారి జ్ఞానేశ్వరి జూన్ 6వ తేదీన అదృశ్యమైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఓ కారు కదలికలు ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి.
కాకినాడ జిల్లా, జులై 6 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో చిన్నారి జ్ఞానేశ్వరి (Tuni Gnaneswari Case) జూన్ 6వ తేదీన అదృశ్యమైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఓ కారు కదలికలు ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. చిన్నారి అదృశ్యమైన రోజున గ్రామంలో ఓ కారు అనుమానాస్పద రీతిలో కనిపించింది. అదే కారు గత రెండు రోజుల నుంచి మళ్లీ ఆ పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని స్థానికులు గమనించారు. ఆ కారుతో పాటు అందులో ఉన్న వ్యక్తులపైనే తమకు అనుమానం ఉందని జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు.
నర్సీపట్నం వద్ద ప్రమాదంతో మరిన్ని అనుమానాలు..
ఈ వ్యవహారంలో మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇదే కారు.. నర్సీపట్నం సమీపంలో చిన్నారికి సంబంధించిన ఒక బంధువును ఢీకొట్టినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇది కేవలం ప్రమాదమా..? లేక కావాలనే చేశారా..? అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రంగంలోకి దిగిన పోలీసులు
కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన ఈ కీలక సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ కారు నంబర్, అది ఎవరి పేరిట రిజిస్టర్ అయి ఉంది?, గత కొన్ని రోజులుగా ఆ కారు ఎక్కడెక్కడ తిరిగింది? అనే విషయాలపై సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు సమగ్రంగా విచారణ చేస్తున్నారు. త్వరలోనే ఈ కారు మిస్టరీ వీడితే, చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో కీలక ఆధారాలు లభించే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి...
గొడ్డలి పార్టీ మా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయిస్తోంది.. సీఎం చంద్రబాబు ధ్వజం
మత్స్యకారులను రక్షించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నాం: పవన్ కల్యాణ్
Read Latest AP News And And National News
And Telugu News