Mahesh Kumar: తిరుమల పవిత్రతపై వైసీపీ కుట్రలు.. ఎంపీ పుట్టా మహేశ్ ఫైర్
ABN , Publish Date - Jan 10 , 2026 | 01:17 PM
వైసీపీ నాయకులు దేవుడి దగ్గర కూడా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో జగన్ ప్రభుత్వం లడ్డూను అపవిత్రం చేసిందని దుయ్యబట్టారు..
తూర్పుగోదావరి జిల్లా, జనవరి10(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ (Eluru MP Putta Mahesh Kumar) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ పవిత్రతను పాడు చేసే విధంగా వైసీపీ వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. సాక్షి ఛానల్ విలేకరులే మద్యం సీసాలు తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో అపవిత్ర కార్యక్రమాలు జరుగుతున్నాయని వారు చెప్పడం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు. మద్యం సీసాలు కొనుగోలు చేసిన జియో ట్యాగింగ్‌తో సహా ఆధారాలన్నీ ఉన్నాయని చెప్పుకొచ్చారు.
లడ్డూను అపవిత్రం చేశారు..
ఇవాళ(శనివారం) తూర్పుగోదావరి జిల్లాలో ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ పర్యటించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు మహేశ్ కుమార్. వైకుంఠ ఏకాదశిని తిరుమలలో ఎలాంటి చిన్న ప్రమాదం జరగకుండా నిర్వహించారని తెలిపారు. వైసీపీ నాయకులు భగవంతుడు దగ్గర కూడా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో జగన్ ప్రభుత్వం లడ్డూను అపవిత్రం చేసిందని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రతిపక్ష పార్టీల బాధ్యత అని చెప్పుకొచ్చారు. వైసీపీ దేవాలయాలను రాజకీయాల కోసం ఉపయోగించుకోవడం సరైనది కాదని పుట్టా మహేశ్ కుమార్ హితవు పలికారు.
ఈ వార్తలు కూడా చదవండి...
జగన్ బెంగళూరు మకాం వెనుక భారీ కుట్రలు.. యనమల సంచలన వ్యాఖ్యలు
దుర్గగుడిలో అపచారం.. ఏం జరిగిందంటే..
Read Latest AP News And Telugu News