కాకినాడ జిల్లా బాణసంచా పేలుళ్ల ఘటన.. కేంద్రప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా..
ABN , Publish Date - Feb 28 , 2026 | 06:53 PM
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలంలో బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుళ్ల ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు. ఈ ఘటనపై పీఎం తీవ్ర విచారం వ్యక్తం చేశారు..
కాకినాడ జిల్లా, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలంలో బాణసంచా తయారీ కేంద్రంలో ఇవాళ (శనివారం) భారీ పేలుడు (Kakinada District Firecracker Explosion) సంభవించింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 23కి చేరింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్(ఎక్స్)లో ట్వీట్ పెట్టారు.
ఈ ఘటన చాలా బాధాకరం: ప్రధాని మోదీ
‘కాకినాడ జిల్లాలోని కర్మాగారంలో ప్రమాదవశాత్తు జరిగిన పేలుడులో ప్రాణనష్టం సంభవించడం చాలా బాధాకరం. ఈ క్లిష్ట సమయంలో బాధితులు, వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 ఎక్స్‌గ్రేషియా పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి అందజేస్తున్నాం’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఈ ఘటనపై అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి

కాకినాడ జిల్లాలోని వేట్లపాలంలో బాణసంచా పేలుళ్ల ఘటనపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్(ఎక్స్)లో ఆయన ట్వీట్ పెట్టారు. ‘ఆంధ్రప్రదేశ్‌లోని బాణసంచా కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసాయం అందుతోంది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని అమిత్ షా పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ హయాంలో వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయింది: సీఎం చంద్రబాబు
కాకినాడ జిల్లా బాణాసంచా పేలుళ్ల కారణాలపై విచారణ చేస్తున్నాం: పవన్ కల్యాణ్
Read Latest Telangana News And AP News And Telugu News