Share News

బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్‌దత్‌తో మంత్రి నారా లోకేశ్ కీలక భేటీ.. ఎందుకంటే..

ABN , Publish Date - Feb 27 , 2026 | 08:43 PM

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్.. బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్‌ను ఇవాళ(శుక్రవారం) కలిశారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు.

బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్‌దత్‌తో మంత్రి నారా లోకేశ్ కీలక భేటీ.. ఎందుకంటే..
AP Minister Nara Lokesh

అమరావతి, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh).. బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్‌ను (Sanjay Dutt) ఇవాళ(శుక్రవారం) కలిశారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ విషయాన్ని లోకేశ్ సోషల్ మీడియా వేదిక ఎక్స్ (ట్విట్టర్) ద్వారా వెల్లడించారు. సంజయ్ దత్‌ను కలవడం ఆనందంగా ఉందని, ఏపీలో సినిమా రంగ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలిపారు.

lokesh-2.jpg


సింగిల్ విండో అనుమతులపై చర్చ..

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా షూటింగ్‌లకు అనుమతులు సులభంగా లభించేలా సింగిల్ విండో వ్యవస్థను అమలు చేసే అంశంపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. సినిమా నిర్మాతలు, దర్శకులు అనుమతుల కోసం అనేక కార్యాలయాలు తిరగాల్సిన అవసరం లేకుండా ఒకే వేదిక ద్వారా అనుమతులు పొందేలా చర్యలు తీసుకుంటున్నామని లోకేశ్ తెలిపారు. ఈ చర్యల ద్వారా ఏపీలో సినిమా నిర్మాణం మరింత వేగవంతం అవుతుందని, రాష్ట్రం చిత్రీకరణకు అనువైన కేంద్రంగా మారుతుందని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.

lokesh-1.jpg


ఫిలిం సిటీ నిర్మాణంపై కీలక చర్చ

ఏపీలో ప్రపంచ స్థాయి ఫిలిం సిటీ నిర్మాణం చేపట్టే అంశంపై కూడా సంజయ్ దత్‌తో చర్చించినట్లు మంత్రి లోకేశ్ వెల్లడించారు. ఫిలిం సిటీ నిర్మాణం ద్వారా రాష్ట్రంలో సినిమా రంగానికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని, ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు. ఫిలిం సిటీ ద్వారా దేశీయ, అంతర్జాతీయ చిత్రీకరణలను ఆకర్షించే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.


ఏపీని షూటింగ్ హబ్‌గా అభివృద్ధి చేస్తాం...

ఏపీలో అందమైన సహజ వనరులు, సముద్ర తీరాలు, కొండ ప్రాంతాలు, చారిత్రక కట్టడాలు వంటి అనేక చిత్రీకరణకు అనువైన ప్రదేశాలు ఉన్నాయని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఈ అవకాశాలను ఉపయోగించుకుని రాష్ట్రాన్ని సినిమా షూటింగ్‌లకు ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేయాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. సినిమా రంగ అభివృద్ధి ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు రావడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని లోకేశ్ అభిప్రాయపడ్డారు.


సినిమా రంగ అభివృద్ధికి కృషి...

ఏపీలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి తమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుందని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. సింగిల్ విండో అనుమతులు, ఫిలిం సిటీ నిర్మాణం, ప్రోత్సాహకాలు వంటి చర్యల ద్వారా సినిమా రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. సంజయ్ దత్ వంటి ప్రముఖులతో జరిగిన చర్చలు రాష్ట్రంలో సినిమా రంగ అభివృద్ధికి దోహదపడతాయని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ హయాంలో వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయింది: సీఎం చంద్రబాబు

జగన్ హయాంలో పరిశ్రమలు ఏపీ నుంచి వెళ్లిపోయాయి.. మంత్రి టీజీ భరత్ ధ్వజం

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 27 , 2026 | 09:02 PM