ప్రియాంక కేసులో దర్యాప్తు ముమ్మరం.. అదనపు సెక్షన్లతో కేసు నమోదు
ABN , Publish Date - Aug 09 , 2026 | 09:46 PM
రాజమహేంద్రవరం ప్రసాదిత్య మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వైద్యవిద్యార్థిని ప్రియాంక ఆదివారం మృతిచెందారు. ఈ కేసులో ఇద్దరు నిందితులపై పోలీసులు అదనపు సెక్షన్లు పెట్టారు.
రాజమహేంద్రవరం, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరం ప్రసాదిత్య మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వైద్యవిద్యార్థిని ప్రియాంక (Medical Student Priyanka Death) ఈరోజు (ఆదివారం) మృతిచెందారు. ఈ కేసులో ఇద్దరు నిందితులపై పోలీసులు అదనపు సెక్షన్లు పెట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తొలిత బాధిత జీఎస్ఎల్ మెడికల్ కళాశాల పీజీ విద్యార్థి ఇచ్చిన ఫిర్యాదుపై ఈనెల నాలుగో తేదీన కేసు నమోదు చేశారు. ఎఫ్.ఐ.ఆర్ నెం. 134/2026, సెక్షన్ 125(b) BNS (పాత IPC 338) కింద కేసు నమోదు చేశారు. సేకరించిన సీసీటీవీ దృశ్యాలు, సాక్షుల వాంగ్మూలాలు ఆధారంగా సెక్షన్ 110 r/w 3(5) BNS (పాత IPC 308 - హత్యాయత్నానికి సమానమైన నేరం) కింద కేసు నమోదు చేశారు.
ఈరోజు డాక్టర్ ప్రియాంక మృతి చెందడంతో నిందితులపై 106 (2) r/w 3(5) Bns సెక్షన్ల నమోదు చేశారు. ప్రధాన నిందితుడు శ్రీనగర్ మోరంపూడికి చెందిన సురవరపు దస్వంత్‌తో పాటు మరో నిందితుడు లాలాచెరువుకు చెందిన దేశభక్తుల ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్‌లను ఈ నెల 6వ తేదీన అరెస్ట్ చేసి, ఏడవ తేదీన రెండో ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేటు వద్ద హాజరు పరిచారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో నిందితులు ఉన్నారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో నిందితులిద్దరికీ కఠిన శిక్షలు పడేలా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సలహాలను పోలీసులు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే నిందితులను కస్టడీకి తీసుకొని విచారణ చేసేందుకు కోర్టులో కస్టడీ పిటిషన్‌ను పోలీసులు వేయనున్నారు.
వార్తలు కూడా చదవండి...
ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు ప్రణాళికతో అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు
వివేకా కేసు.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు వైఎస్ సునీతా సంచలన లేఖ
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. నోటిఫికేషన్ విడుదల
Read Latest AP News And Telangana News And National News
And Telugu News