కాకినాడ జిల్లా బాణసంచా పేలుళ్ల ఘటన.. పూర్తి నివేదిక ఇవ్వాలి.. అధికారులకు సీఎం ఆదేశాలు
ABN , Publish Date - Feb 28 , 2026 | 07:04 PM
వేట్లపాలెంలో బాణసంచా ప్రమాద స్థలిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు.పేలుడు ఘటన తీరును అధికారులు సీఎంకి వివరించారు. ఈ ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
కాకినాడ జిల్లా, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే, వేట్లపాలెంలో బాణసంచా ప్రమాద స్థలిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) పరిశీలించారు. జిల్లా కలెక్టర్ వాహనంలో వేట్లపాలెం చేరుకున్నారు. బాణసంచా పేలుడు బాధిత కుటుంబాలను పరామర్శించారు. పేలుడు ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. పేలుడు ఘటన తీరును అధికారులు సీఎంకి వివరించారు. ఈ ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాకినాడ జిల్లా బాణసంచా పేలుళ్ల ఘటన.. పూర్తి నివేదిక ఇవ్వాలి.. అధికారులకు సీఎం ఆదేశాలు
కాకినాడ జిల్లా బాణాసంచా పేలుళ్ల కారణాలపై విచారణ చేస్తున్నాం: పవన్ కల్యాణ్
Read Latest Telangana News And AP News And Telugu News