తెలుగు రాష్ట్రాల జల వివాదం.. సీడబ్ల్యూసీ కీలక సమావేశం
ABN , Publish Date - Sep 07 , 2026 | 11:10 AM
ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారంపై ఢిల్లీ కేంద్ర జల సంఘంలో సీడబ్ల్యూసీ సమావేశం ఈరోజు (సోమవారం) జరిగింది. ఈ సమావేశం 10:30 గంటలకు ప్రారంభమైంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై అధికారులు చర్చించారు.
ఢిల్లీ, సెప్టెంబర్ 7 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారంపై ఢిల్లీ కేంద్ర జల సంఘంలో సీడబ్ల్యూసీ సమావేశం ఈరోజు (సోమవారం) జరిగింది. ఈ సమావేశం 10:30 గంటలకు ప్రారంభమైంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై అధికారులు చర్చించారు. 2026 జనవరిలో ఇరు రాష్ట్రాల సీఎంలు, జలశక్తి మంత్రి, ఉన్నతాధికారుల భేటీకి కొనసాగింపుగా ఇవాళ సమావేశం నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై అజెండాను సీడబ్ల్యూసీ ఖరారు చేయనుంది.
కేంద్ర జలసంఘం చైర్మన్ నేతృత్వంలో జరిగే ఈ భేటీకి ఇరు రాష్ట్రాల అధికారులు హాజరుకానున్నారు. 2026 జనవరిలో జరిగిన భేటీ తర్వాత ఇప్పటివరకు అజెండా ఖరారు కాలేదు. ఇరు రాష్ట్రాల నుంచి అంశాల జాబితా ఇవ్వాలని పలుమార్లు కేంద్ర జల సంఘం లేఖలు రాసిన విషయం తెలిసిందే. ఇరు రాష్ట్రాల నుంచి స్పందన లేకపోవడంతో ఈ సమావేశానికి సీడబ్ల్యూసీ చైర్మన్ పిలిచారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈహెచ్‌ఎస్ అమల్లో రాజీ లేదు: భట్టి విక్రమార్క
అసెంబ్లీ సమావేశాలకు అందరూ తప్పకుండా హాజరుకావాలి: కేసీఆర్
త్వరలో తెలంగాణ ఆర్టీసీ - హైదరాబాద్ మెట్రో రైల్ ఉమ్మడి పాస్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News