Share News

పలు వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల ఏర్పాటు..

ABN , Publish Date - May 07 , 2026 | 11:42 AM

పలు రెగ్యులర్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఈనెలలోనే ప్రారంభం కానున్నాయి. అలాగే వేసవి ప్రత్యేక రైళ్లు కూడా ఏర్పాటు చేశారు.

పలు వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల ఏర్పాటు..
Weekly Expres Trains

తిరుపతి: పలు రెగ్యులర్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఈనెలలోనే ప్రారంభం కానున్నాయి. అలాగే వేసవి ప్రత్యేక రైళ్లు కూడా ఏర్పాటు చేశారు.

  • విశాఖపట్టణం-కొల్లాయం వీక్లీ ఎక్స్‌ప్రెస్‌: ఈ రైలు(18501) ప్రతి మంగళవారం ఉదయం 8.20గంటలకు విశాఖలో బయల్దేరుతుంది. అదే రోజు రాత్రి 9.25గంటలకు రేణిగుంటకు చేరుకొని తమిళనాడు మీదుగా బుధవారం మధ్యాహ్నం 2.50గంటలకు కేరళలోని కొల్లాయం చేరుకుంటుంది. అదే రోజున సాయంత్రం 5.20గంటలకు ఈ రైలు(18502)కొల్లాయం నుంచి బయల్దేరి తమిళనాడు మీదుగా గురువారం ఉదయం 10.15గంటలకు రేణిగుంటకు చేరుకుంటుంది.అదే రాత్రి 11గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఇప్పటి వరకు రద్దీకి అనుగుణంగా నడిచే ఈ రైలు ఇకపై వీక్లీ ఎక్స్‌ప్రెస్‏గా 12నుంచి నడవనుంది.


  • తిరుపతి-చాప్ర ప్రత్యేక రైలు: 07443 నెంబర్‌తో గురువారం అర్ధరాత్రి 11.55గంటలకు తిరుపతి నుంచి బయల్దేరుతుంది. కర్నూలుమీదుగా నిజామాబాద్‌, నాందేడ్‌, అకోల, భోపాల్‌, కాన్పూర్‌, లక్నో, అయోధ్య మీదుగా 10న ఉదయం 7.45గంటలకు చాప్ర చేరుకుంటుంది. 07444 నెంబర్‌తో 12న ఉదయం 5గంటలకు చాప్ర నుంచి బయల్దేరి వెళ్లిన మార్గంలోనే ప్రయాణిస్తూ 14న ఉదయం 12.30గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.


  • తిరుపతి-పండరాపూర్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌: ఈ రైలు (17437) ప్రతి శనివారం సాయంత్రం 4 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరి కర్నూలు,సికింద్రాబాదు, బీదర్‌, లాతూర్‌ మీదుగా పండరాపూర్‌కు ఆదివారం సాయంత్రం 7గంటలకు చేరుకుంటుంది. అదే రోజు రాత్రి 8గంటలకు ఈ రైలు (17438) పండరాపూర్‌ నుంచి బయల్దేరి వెళ్లిన మార్గంలో ప్రయాణిస్తూ సోమవారం రాత్రి 11.30గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఇప్పటి వరకు రద్దీకి అనుగుణంగా నడిచే ఈ రైలు ఇకపై వీక్లీ ఎక్స్‌ప్రెస్‏గా 16నుంచి నడవనుంది.


city1.jpg

  • తిరుచానూరు-నాందేడ్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌: ఈ రైలు (17633) ప్రతి శనివారం సాయంత్రం 4.45గంటలకు నాందేడ్‌ నుంచి బయల్దేరి నిజామాబాద్‌, వరంగల్‌, విజయవాడ మీదుగా ఆదివారం మధ్యాహ్నం 12.20గంటలకు తిరుచానూరు చేరుకుంటుంది.అదే రోజు రాత్రి 7.45గంటకు ఈ రైలు (17634) తిరుచానూరు నుంచి బయల్దేరి వచ్చిన మార్గంలోనే ప్రయాణిస్తూ సోమవారం సాయంత్రం 6.20గంటలకు తిరుచానూరుకు చేరుకుంటుంది. ఇప్పటి వరకు రద్దీకి అనుగుణంగా నడిచే ఈ రైలు ఇకపై వీక్లీ ఎక్స్‌ప్రెస్‏గా 9నుంచి నడవనుంది.


  • తిరుచానూరు-జాల్నా వీక్లీ ఎక్స్‌ప్రెస్‌: ఈ రైలు (7637)ప్రతి సోమవారం ఉదయం 7గంటలకు జాల్నా నుంచి బయల్దేరి లాతూరు, బీదర్‌, లింగంపల్లి, నల్గొండ, గుంటూరు, నెల్లూరు మీదుగా మంగళవారం మధ్యాహ్నం 12గంటలకు తిరుచానూరు చేరుకుంటుంది. ఇదే రోజున మధ్యాహ్నం 3.15గంటలకు తిరుచానూరు నుంచి బయల్దేరి వచ్చిన మార్గంలోనే ప్రయాణిస్తూ బుధవారం రాత్రి 9గంటలకు జాల్నాకు చేరుకుంటుంది. ఇప్పటి వరకు రద్దీకి అనుగుణంగా నడిచే ఈ రైలు ఇకపై వీక్లీ ఎక్స్‌ప్రెస్‏గా 11నుంచి నడవనుంది.


ఈ వార్తలు కూడా చదవండి:

చూస్తే నోరూరు.. తింటే బేజారు!

పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..

Read Latest Telangana News and National News

Updated Date - May 07 , 2026 | 11:42 AM