తమిళనాడులో మళ్లీ ఎన్నికలు జరగాలి: జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు
ABN , Publish Date - May 07 , 2026 | 11:00 AM
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం రాలేదు. 108 సీట్లు సాధించిన విజయ్ 'టీవీకే' అతి పెద్ద పార్టీగా నిలిచినప్పటికీ మ్యాజిక్ ఫిగర్‌కు 10 సీట్ల దూరంలో ఆగిపోయింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతు కోసం ఆ పార్టీ ముఖ్యులు మల్లగుల్లాలు పడుతున్నారు.
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం రాలేదు. 108 సీట్లు సాధించిన విజయ్ 'టీవీకే' అతి పెద్ద పార్టీగా నిలిచినప్పటికీ మ్యాజిక్ ఫిగర్‌కు 10 సీట్ల దూరంలో ఆగిపోయింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతు కోసం ఆ పార్టీ ముఖ్యులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో 'జోహో' వ్యవస్థాపకుడు, తమిళనాడుకు చెందిన శ్రీధర్ వెంబు (Sridhar Vembu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించి, తిరిగి ఎన్నికలు జరిపించాలని శ్రీధర్ వెంబు విజ్ఞప్తి చేశారు. 'ఇతర పార్టీల మద్దుతో ప్రభుత్వం ఏర్పాటైనా వివిధ రకాల ఒత్తిళ్లు, అంతర్గత విభేదాలతో అది అస్థిరంగా ఉండే అవకాశం ఉంది. తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించి, మళ్లీ ఎన్నికలు జరిపించాలి. ఈసారి ఓటుకు నోటు పద్ధతిని అరికట్టేలా చర్యలు తీసుకోవాలి. విజయ్ భారీ మెజార్టీతో తిరిగి వస్తారని నేను భావిస్తున్నా' అంటూ శ్రీధర్ అభిప్రాయపడ్డారు (TVK super majority).
ఒకవేళ విజయ్ పార్టీని అడ్డుకోవాలనుకుంటే డీఎంకే, ఏడీఎంకే కలిసి పోటీ చెయ్యొచ్చని కూడా శ్రీధర్ సూచించారు (Tamil Nadu elections 2026). బీజేపీ మాత్రం రాష్ట్రంలో ఒంటరిగానే పోటీ చేసి సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాలని అన్నారు. ప్రస్తుతం ఏ పార్టీకీ సంపూర్ణ మెజార్టీ రాని నేపథ్యంలో సుస్థిర ప్రభుత్వం కోసం ప్రజలే మళ్లీ ఓ కొత్త నిర్ణయం తీసుకునే అవకాశం కల్పించాలని శ్రీధర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
భారత్ మళ్లీ దాడి చేస్తే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుంది: పాక్ రక్షణ మంత్రి
పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..