అల్లూరి సీతారామరాజు వర్ధంతి.. సీఎం చంద్రబాబు ఘన నివాళి
ABN , Publish Date - May 07 , 2026 | 10:55 AM
స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామారాజు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు.
అమరావతి, మే 7: స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామారాజు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. గిరిజన హక్కుల పరిరక్షణ కోసం మన్యం ప్రజల గుండెల్లో పౌరుషాగ్ని రగిలించిన విప్లవ యోధుడు అల్లూరి అని అన్నారు. తెల్లవారిని గడగడలాడించిన తెలుగువీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఆ దేశభక్తుని చరిత్రను స్మరించుకుంటూ నివాళి అర్పిద్దాం అంటూ ఎక్స్‌లో సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు.
ఆ మహనీయుని స్మృతికి నా ప్రగాఢ నివాళి: లోకేశ్
అల్లూరి వర్ధంతి సందర్భంగా మంత్రి లోకేశ్ నివాళులర్పించారు. ‘భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని విప్లవ మార్గంలో నడిపించిన యోధుడు అల్లూరి సీతారామరాజు. ఆయన జీవితం, త్యాగాలు, స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటం మన దేశ చరిత్ర పుటల్లో శాశ్వతంగా లిఖించబడ్డాయి. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా.. ఆ మహనీయుని స్మృతికి నా ప్రగాఢ నివాళులు అర్పిస్తున్నాను’ అంటూ ఎక్స్‌లో లోకేశ్ పోస్ట్ చేశారు. .
ఇవి కూడా చదవండి...
విశాఖలో ‘అల్లూరి స్ఫూర్తి యాత్ర’.. పాల్గొన్న పీవీఎన్ మాధవ్
‘ఏపీకి ఎవరొస్తున్నారో తెలుసా’?.. లోకేశ్ ఆసక్తికర పోస్ట్
Read Latest AP News And Telugu News