Share News

‘ఏపీకి ఎవరొస్తున్నారో తెలుసా’?.. లోకేశ్ ఆసక్తికర పోస్ట్

ABN , Publish Date - May 07 , 2026 | 10:41 AM

సోషల్ మీడియా ఎక్స్‌లో మంత్రి నారా లోకేశ్ ఓ ఆసక్తికర వీడియోను పోస్ట్ చేశారు. ‘ఏపీకి ఎవరు వస్తున్నారో తెలుసా..?’ అంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు.

‘ఏపీకి ఎవరొస్తున్నారో తెలుసా’?.. లోకేశ్ ఆసక్తికర పోస్ట్
Minister Nara Lokesh

అమరావతి, మే 7: సోషల్ మీడియా ఎక్స్‌లో మంత్రి నారా లోకేశ్ ఓ ఆసక్తికర వీడియోను పోస్ట్ చేశారు. ‘ఏపీకి ఎవరు వస్తున్నారో తెలుసా..?’ అంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. ‘Guess who’s coming to AP?’ అంటూ వీడియోను పోస్ట్ చేసిన లోకేశ్.. అందులో నీట్‌గా టక్‌ వేసుకుని, ట్రెండీ కళ్లజోడు పెట్టుకుని.. న్యూ లుక్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్(బుల్లెట్) డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నట్లు కనిపించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. మంత్రి లోకేశ్ లుక్‌ను పరిశీలించిన నెటిజన్లు ఏపీకి ఎవరు వస్తున్నారో కనిపెట్టేశారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌కు రాబోతున్నట్లు అంచనా వేశారు.


ఏపీకి రాయల్ ఎన్‌ఫీల్డ్..

బుధవారం నాడు(నిన్న) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 17వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎస్‌ఐపీబీ) సమావేశంలో భారీగా పెట్టుబడులకు ఆమోదముద్ర వేసింది. అందులో రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఎస్‌ఐపీబీ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. తిరుపతిలో రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ రూ.2,500 కోట్లతో మోటర్ సైకిల్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ఈ క్రమంలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్ సంస్థ ఏపీకి రాబోతోందంటూ ఇన్‌డైరెక్ట్‌గా ఎక్స్‌లో మంత్రి లోకేశ్ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.


ఇవి కూడా చదవండి...

నిరుద్యోగులకు శుభవార్త!

విశాఖలో ‘అల్లూరి స్ఫూర్తి యాత్ర’.. పాల్గొన్న పీవీఎన్ మాధవ్

Read Latest AP News And Telugu News

Updated Date - May 07 , 2026 | 11:47 AM