Share News

భూ వివాదాల్లేని రాష్ట్రంగా ఏపీని తయారు చేస్తాం: మంత్రి అనగాని సత్యప్రసాద్

ABN , Publish Date - May 07 , 2026 | 11:02 AM

ఏపీని గత పాలకులు విధ్వంసం చేసినా.. పునర్నిర్మించుకుంటున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. భూ సంబంధిత అంశాల్లో సంస్కరణలు తీసుకువచ్చామని.. అడంగళ్లు, పాస్ పుస్తకాలు వేగంగా అందిస్తున్నామని చెప్పారు.

భూ వివాదాల్లేని రాష్ట్రంగా ఏపీని తయారు చేస్తాం: మంత్రి అనగాని సత్యప్రసాద్
Anagani Satya Prasad

అమరావతి, మే 7: బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సాధించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రి అనగాని సత్యప్రసాద్ అభినందనలు తెలియజేశారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరుగుతున్న 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో మంత్రి ప్రసంగిస్తూ.. రాష్ట్రాన్ని గత పాలకులు విధ్వంసం చేసినా.. పునర్నిర్మించుకుంటున్నామని తెలిపారు. భూ సంబంధిత అంశాల్లో సంస్కరణలు తీసుకువచ్చామని.. అడంగళ్లు, పాస్ పుస్తకాలు వేగంగా అందిస్తున్నామని చెప్పారు. 1.37 లక్షల ఎకరాలు 22ఏ నుంచి తొలగించామని మంత్రి వివరించారు.


రిజిస్ట్రేషన్ శాఖను సిటిజెన్ ఫ్రెండ్లీగా తయారు చేస్తున్నామని మంత్రి తెలిపారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ సర్వీసులు ఒకటే ప్లాట్ ఫాంపైకి తీసుకురావాలని నిర్ణయించామన్నారు. డిజిటలైజేషన్ ప్రక్రియను వేగంగా చేపడుతున్నామని చెప్పారు. రీసర్వే ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి భూ వివాదాల్లేని రాష్ట్రంగా ఏపీని తయారు చేస్తామని వెల్లడించారు. రాష్ట్రం నుంచి సింగపూర్ దేశానికి అధ్యయనం కోసం వెళ్లామని.. పాలనాపరమైన అంశాలను చాలా నేర్చుకున్నామని అన్నారు. సింగపూర్ దేశంలో ప్రెసిషన్, ఇంటిగ్రేషన్, సైన్స్‌ను పాలనలో ఇంటిగ్రేట్ చేశారన్నారు. గవర్నెన్సు అంటే టీమ్ వర్క్‌గా పని చేస్తున్న విధానం సింగపూర్‌లో ఉందని... ఏపీలోనూ ఇదే అంశాన్ని సీఎం పదేపదే చెబుతున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.


10 సూత్రాలతో స్వర్ణాంధ్ర 2047 సాకారం: సీఎస్

నిర్దేశించుకున్న లక్ష్యాలను రీ-ఫోకస్ చేసేందుకు కలెక్టర్ల కాన్సరెన్స్‌ ఉపకరిస్తోందని సీఎస్ సాయిప్రసాద్ అన్నారు. సుపరిపాలనతో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నది ప్రభుత్వ విధానమని తెలిపారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సు- సర్వీస్ డెలివరీ అనేది అత్యంత కీలకమైన అంశమని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి నిర్దేశించిన 10 సూత్రాల ఆధారంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ సాకారమవుతుందన్నారు. పెట్టుబడులను ఆకర్షించటం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేయగలమని తెలిపారు. స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టిస్తేనే అభివృద్ధి, స్వయం సమృద్ధి సాధించగలమన్నారు. విద్య, వైద్యం లాంటి సంక్షేమ కార్యక్రమాలను సమర్ధంగా ప్రజలకు అందించాలన్నారు. సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్తూ నిర్ణయాలు తీసుకోవటంలో ఎలాంటి సంకోచం ఉండకూడదని సీఎస్ సాయి ప్రసాద్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

నిరుద్యోగులకు శుభవార్త!

విశాఖలో ‘అల్లూరి స్ఫూర్తి యాత్ర’.. పాల్గొన్న పీవీఎన్ మాధవ్

Read Latest AP News And Telugu News

Updated Date - May 07 , 2026 | 11:14 AM