తిరుపతి జిల్లాలో పంచాయతీ ఎన్నికల నగారా.. 777 సర్పంచ్ స్థానాలకు పోరు!
ABN , Publish Date - Nov 10 , 2026 | 07:56 AM
తిరుపతి జిల్లాలో పంచాయతీ ఎన్నికల సమరానికి అధికారులు సిద్ధమవుతున్నారు. రెండు విడతల్లో 777 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలను నిర్వహించనున్నారు.
తిరుపతి జిల్లా, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లాలో పంచాయతీ ఎన్నికల సమరానికి అధికారులు సిద్ధమవుతున్నారు. రెండు విడతల్లో 777 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలను నిర్వహించనున్నారు. తిరుపతి జిల్లాలో 35 మండలాల్లోని 777 పంచాయతీలు, 7,210 వార్డుల్లో 2 విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఆయా కోర్టు కేసుల కారణంగా ఈ జిల్లాలోని 30 పంచాయతీలకు ఎన్నికలు నిలిచిపోనున్నాయి.
తొలి విడత షెడ్యూల్..
తిరుపతి జిల్లా 18 మండలాల్లోని 415 సర్పంచ్ స్థానాలకు ఈ నెల 17వ తేదీ వరకు నామినేషన్లను ఎన్నికల అధికారులు స్వీకరించనున్నారు. 18 మండలాల్లో ఈ నెల 26వ తేదీన పోలింగ్, అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు, ఫలితాలను అధికారులు వెల్లడించనున్నారు.
రెండో విడత షెడ్యూల్..
తిరుపతి జిల్లాలోని చంద్రగిరి, తిరుపతి రూరల్ సహా 17 మండలాల్లోని 362 సర్పంచ్ స్థానాలకు ఈ నెల 20వ తేదీన నామినేషన్లను ఎన్నికల అధికారులు స్వీకరించనున్నారు.
రెండో విడత పోలింగ్..
తిరుపతి జిల్లాలోని 17 మండలాల్లో ఈ నెల 29వ తేదీన పోలింగ్, అదే రోజు సాయంత్రం ఫలితాలను ఎన్నికల అధికారులు వెల్లడించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కూటమి సర్కార్ కీలక నిర్ణయం.. ఏపీ ఎండీసీకి రూ.115 కోట్ల గ్యారెంటీ మంజూరు
స్థానిక ఎన్నికల ఫలితాలను వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.. మంత్రి ఆనం ధ్వజం
సహకార సంఘాల ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం కసరత్తు..!
Read Latest AP News And Telangana News And National News
And Telugu News