Share News

Tirumala: అలర్ట్.. తిరుమలలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే..

ABN , Publish Date - Jan 01 , 2026 | 08:52 PM

వైకుంఠ ఏకాదశి, న్యూఇయర్ వరుస సెలవులతో తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వైకుంఠ ద్వార దర్శనం కోసం వేలాదిగా సామాన్య భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ముఖ్యంగా రేపటి నుంచి సర్వదర్శనానికి తిరిగి అనుమతి ఇవ్వనున్న నేపథ్యంలో, ముందుగానే పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు రావడంతో రద్దీ భారీగా పెరిగింది.

Tirumala: అలర్ట్.. తిరుమలలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే..
Tirumala

తిరుమల, జనవరి1 (ఆంధ్రజ్యోతి): వైకుంఠ ఏకాదశి, న్యూఇయర్ వరుస సెలవులతో తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వైకుంఠ ద్వార దర్శనం కోసం వేలాదిగా సామాన్య భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ముఖ్యంగా రేపటి నుంచి సర్వదర్శనానికి తిరిగి అనుమతి ఇవ్వనున్న నేపథ్యంలో, ముందుగానే పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు రావడంతో రద్దీ భారీగా పెరిగింది. సామాన్య భక్తులతో పాటు వీఐపీలు కూడా తిరుమలకు భారీగా తరలి వచ్చి కలియుగ వైకుంఠనాథుడు వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటన్నారు.

TIRUMALA.jpg


ఈ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. టీటీడీ అధికారుల అంచనాలకు మించి భక్తులు చేరుకోవడంతో, ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఏర్పాటుచేసిన క్యూ లైన్ నుంచి భక్తులను క్రమబద్ధంగా లోపలి క్యూ లైన్లలోకి అనుమతిస్తున్నారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, ఆహారం, భద్రతా ఏర్పాట్లు పటిష్టం చేసినట్లు అధికారులు తెలిపారు.

TIRUMALA-7.jpg


క్యూ లైన్లలో నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తూ, భక్తుల కదలికలు సజావుగా సాగేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వైకుంఠ ద్వార దర్శనం, సర్వదర్శనం ప్రారంభం కారణంగా వచ్చే కొన్ని రోజులు తిరుమలలో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు తెలిపారు. శ్రీవారి దర్శనం దృష్ట్యా భక్తులు సహనం పాటించాలని సూచించారు. టీటీడీ అధికారుల సూచనలను పాటించి తమకు సహకరించాలని కోరారు. భక్తులు భారీగా తరలి వస్తుండటంతో శ్రీవారి దర్శనానికి ఆలస్యమవుతోందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.

TIRUMALA-2jpg.jpg


ఇవి కూడా చదవండి...

రైతులకు గుడ్‌న్యూస్.. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..

సంస్కరణల పథంలో అభివృద్ధి రథం:పవన్ కల్యాణ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 01 , 2026 | 09:10 PM