Share News

కుప్పం విమానాశ్రయానికి గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

ABN , Publish Date - Apr 30 , 2026 | 06:02 PM

చిత్తూరు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కుప్పం విమానాశ్రయ ప్రాజెక్టుకు పెద్ద ఊరట లభించింది. భూసేకరణపై కొనసాగుతున్న న్యాయపరమైన వివాదాలకు ముగింపు పలుకుతూ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.

కుప్పం విమానాశ్రయానికి గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
Kuppam Airport

ఢిల్లీ, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి):  చిత్తూరు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కుప్పం విమానాశ్రయ ప్రాజెక్టుకు పెద్ద ఊరట లభించింది. భూసేకరణపై కొనసాగుతున్న న్యాయపరమైన వివాదాలకు ముగింపు పలుకుతూ సుప్రీంకోర్టు (Supreme Court) కీలక తీర్పు వెలువరించింది. కుప్పం విమానాశ్రయం కోసం చేపట్టిన భూసేకరణను సవాల్ చేస్తూ దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP)ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో ముందుగా ఏపీ హై కోర్టు (AP High Court) ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.


భూసేకరణ చట్టబద్ధమే..

ఈ ప్రాజెక్టు కోసం సుమారు 150 ఎకరాల భూమిని సేకరించేందుకు చిత్తూరు జిల్లా కలెక్టర్ జారీ చేసిన నాలుగు నోటిఫికేషన్లు చట్టబద్ధమేనని సుప్రీంకోర్టు తేల్చింది. భూమి అనుకూలతపై సరైన ఆధారాలు లేవంటూ చక్రపాణి రెడ్డి, ఇతరులు చేసిన వాదనలను కోర్టు తిరస్కరించింది. ఈ కేసుకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఇతర అనుబంధ పిటిషన్లు కూడా ముగిసినట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఈ ప్రాజెక్టుకు ఉన్న న్యాయపరమైన అన్ని అడ్డంకులు పూర్తిగా తొలగిపోయాయి.


అభివృద్ధికి మార్గం సుగమం

ఈ తీర్పుతో కుప్పం విమానాశ్రయ పనులు త్వరలోనే వేగవంతం కానున్నాయి. ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి, రవాణా సౌకర్యాల మెరుగుదల, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి అవకాశాల పెరుగుదల వంటి అంశాలకు ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుంది. కుప్పం విమానాశ్రయ నిర్మాణం పూర్తయితే దక్షిణ ఆంధ్రప్రదేశ్‌కు మెరుగైన ఎయిర్ కనెక్టివిటీ, సమీప ప్రాంతాల ఆర్థిక వృద్ధి, టూరిజం అభివృద్ధి వంటి ప్రయోజనాలు కలగనున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి...

ఇంధనం కొరతపై సీఎం చంద్రబాబు సమీక్ష.. రంగంలోకి యంత్రాంగం..

పెట్టుబడులతో ఏపీ కొత్త చరిత్ర సృష్టిస్తోంది: మంత్రి లోకేశ్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Apr 30 , 2026 | 06:57 PM