‘సర్’ రెండు రోజులే కీలకం
ABN , Publish Date - Jul 11 , 2026 | 11:11 AM
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) తుది అంకానికి చేరుకుంది. అధికారికంగా 14వ తేదీ ఆఖరు గడువు అయినా ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్‌వోలకు అందజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
తుది దశకు చేరుకున్న ప్రక్రియ
గడువు రెండు రోజులే: ప్రత్యేకాధికారి క్రిష్ణ కిశోర్
ఉరుకులు, పరుగులతో శిబిరాల సందర్శన
డిజిటలైజేషన్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి: రాజకీయ పార్టీలు
సర్వర్ సమస్య తలెత్తకుండా చూడాలని ప్రజల వినతి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కార్యక్రమానికి చివరి రెండు రోజులే కీలకం. గడువు ముగుస్తోందని ప్రక్రియలో వేగం పెంచాలని పీలేరు ప్రత్యేకాధికారి క్రిష్ణకిశోర్ బీఎల్‌వోలకు సూచిస్తున్నారు. రాజకీయ పార్టీల నేతలు, బీఎల్‌ఓ, బీఎల్‌ఏలు అధిక సమయం వెచ్చించాల్సిన అవసరం ఉంది. ఎవరి ఓటునూ తొలగించబోమని ఆర్‌వో, ఈఆర్‌వోలు ప్రకటిస్తున్నా ఎన్యూమరేషన్ ఫారాలు పూరించడంలో జరుగుతున్న జాప్యం, బీఎల్‌వోల పర్యవేక్షణ లోపం వెరసి ప్రజల ఓట్లకు గండి పడే అవకాశం ఉంటుందని ఓటర్లు అనుమానిస్తున్నారు. చివరి రెండు రోజులు డిజిటలైజేషన్ ప్రక్రియలో ఉద్యోగులు విధులకు గైర్హాజరైతే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. నెట్‌వర్క్ సమస్య తలెత్తకుండా, కంప్యూటర్లు మొరాయించకుండా ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వివరాల్లోకెళితే....
పీలేరు(తిరుపతి): స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) తుది అంకానికి చేరుకుంది. అధికారికంగా 14వ తేదీ ఆఖరు గడువు అయినా ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్‌వోలకు అందజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. డిజిటలైజేషన్‌కు సమయం కావాల్సి ఉండడంతో అధికారులు ముందస్తు జాగ్రత్త తీసుకుంటున్నారు. నియోజకవర్గంలో ఇంకా ఎన్యూమరేష న్ ఫారాలు మిగిలిపోవడం, తీసుకున్న ఫారాలను ప్రజలు తిరిగి ఇవ్వక పోవడం అధికారుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నా ప్రజల్లో ఆశించిన స్పందన రావడం లేదని అధికారులు వాపోతుండగా ఆ ఫారాల ను పూరించడం కష్టతరమని రాజకీయ పార్టీల ఏజెంట్లు వ్యాఖ్యానిస్తున్నారు. ‘సర్’ ప్రక్రియలో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చివరి రోజులు సర్వర్ సమస్య తలెత్తకుండా చూసుకోవాలని, ప్రస్తుతం ఉన్న కంప్యూటర్లను మరిన్ని పెంచి డిజిటలైజేషన్ ప్రక్రియలో వేగం పెంచాలని కోరుతున్నారు.
77 శాతం డిజిటలైజేషన్
పీలేరు నియోజకవర్గంలో శుక్రవారం సాయం త్రానికి 77 శాతం ఎన్యూమరేషన్ ఫారాల డిజి టలైజేషన్ పూర్తయింది. గుర్రంకొండ మండ లంలో 35,214 ఫారాలకు 28,405తో (80.66 శాతం), కలకడ మండలంలో 28,070 ఫారా ల కు 21,729తో 77.29 శాతం, కేవీపల్లెలో 32,052 ఫారాలకు 25,569తో 82.51 శాతం, వాల్మీకిపు రంలో 36,591 ఫారాలకు 25,569తో 80.85 శా తం, కలికిరిలో 40,297 ఫారాలకు 28,912తో 72.96 శాతం, పీలేరులో 63,268 ఫారాలకు 43,646తో 69.40 శాతం డిజిటలైజేషన్ జరిగింది.
పీలేరుపై ప్రత్యేక శ్రద్ధ
డిజిటలైజేషన్‌లో వెనుకబడ్డ పీలేరు మండలం పై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారి కృష్ణకిశోర్, ఎంపీడీవో శివశంకర్, తహసీల్దారు శివకుమార్ ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, డిజిటలైజేష న్‌లో వెనుకబడ్డ బీఎల్‌వోలను గుర్తించి వారితో స్వయంగా మాట్లాడుతున్నారు. వారికి ఎదురైన సమస్యలను పరిశీలిస్తూ వాటిని అధిగమించేం దుకు సూచనలు అందజేస్తున్నారు. నియోజక వర్గ ప్రత్యేక అధికారి కృష్ణకిశోర్ ‘సర్’ సహాయ శిబిరాలను సందర్శించి ఓటర్లను గుర్తించేందు కు తహసీల్దారు శివకుమార్, రేషన్ డీలర్లు, డ్వాక్రా మహిళలను రంగంలోకి దించారు.
సాంకేతిక సమస్య రాకుండా చూడాలి
ఈ నెల 14వ తేదీతో గడువు ముగుస్తున్నందున రానున్న నాలుగు రోజులు ‘సర్’ ప్రక్రియలో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా తగిన జా గ్రత్తలు తీసుకోవాలని రాజకీయ పార్టీల నేతలు అధికారులను కోరుతున్నారు. ఒక్కసారిగా లోడు పెరగడంతో సర్వర్ సమస్యలు తలెత్త డం, సర్వర్ ఆగిపోవడం, నెట్ పనిచేయకపోవడం వంటి సమస్యలు ఎదురుకావొచ్చని అంచనా వేస్తున్నారు. బీఎల్‌వోలకు కంప్యూటర్లు ఏర్పాటు చేయడం, సహాయ శిబిరాల్లోనే కం ప్యూటర్లు ఏర్పాటు చేసి డిజిటలైజేషన్ ప్రక్రియ లో వేగం పెంచాలని వారు కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News