'ఫార్చ్యూన్ ఇండియా' మోస్ట్ పవర్‌ఫుల్ విమెన్ జాబితాలో నారా బ్రాహ్మణి
ABN , Publish Date - Jul 11 , 2026 | 10:46 AM
దేశంలోని అత్యంత ప్రభావవంతమైన మహిళల జాబితాలో నారా బ్రాహ్మణి చోటు దక్కించుకోవడం విశేషంగా నిలిచింది. 'ఫార్చ్యూన్ ఇండియా' విడుదల చేసిన 100 మోస్ట్ పవర్‌ఫుల్ విమెన్ జాబితాలో ఆమె ఎంపిక కావడంపై మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలోని అత్యంత ప్రభావవంతమైన మహిళా పారిశ్రామికవేత్తల్లో ఒకరిగా నారా బ్రాహ్మణి నిలవడంపై మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. 'ఫార్చ్యూన్ ఇండియా' విడుదల చేసిన '100 మోస్ట్ పవర్‌ఫుల్ విమెన్' జాబితాలో బ్రాహ్మణికి చోటు దక్కడం గర్వకారణమని ఆయన ఎక్స్ (ట్విటర్) వేదికగా పేర్కొన్నారు. ఆమె ప్రతిభ, నాయకత్వ సామర్థ్యాలతో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక సదస్సులో నారా బ్రాహ్మణికి ఈ గుర్తింపునకు సంబంధించిన అవార్డును అందజేశారు. దేశ ఆర్థికాభివృద్ధికి విశేషంగా తోడ్పడుతున్న మహిళా పారిశ్రామికవేత్తల జాబితాలో ఆమెకు స్థానం లభించడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా బ్రాహ్మణి మాట్లాడుతూ.. హెరిటేజ్ ఫుడ్స్ ఎదుగుదల వెనుక రైతుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు.
రైతుల ఆదాయాన్ని పెంచడం, వారి జీవనోపాధిని మరింత మెరుగుపరచడం తమ సంస్థ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. బ్రాహ్మణి సాధించిన ఈ గుర్తింపు మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రేరణగా నిలుస్తుందని, భారత పారిశ్రామిక రంగంలో మహిళల పాత్ర మరింత బలపడుతున్నదానికి ఇది నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Also Read:
పెళ్లిలో మటన్‌కు బదులు చికెన్ పెట్టారని గొడవ.. కర్రలు, కుర్చీలతో దాడులు..