Share News

పెళ్లిలో మటన్‌కు బదులు చికెన్ పెట్టారని గొడవ.. కర్రలు, కుర్చీలతో దాడులు..

ABN , Publish Date - Jul 11 , 2026 | 10:29 AM

బిహార్‌లో దారుణం చోటుచేసుకుంది. పెళ్లిలో మటన్ కోసం చోటుచేసుకున్న గొడవ కారణంగా 12 మంది తీవ్రగాయాలపాలయ్యారు. పెళ్లి కూతురు తరఫు వారు మటన్ పెడతామని చెప్పి చికెన్ పెట్టడంతో పెళ్లి కుమారుడి తరఫు వారు ప్రశ్నించారు. దీంతో గొడవ మొదలై భీకర యుద్ధానికి దారి తీసింది.

పెళ్లిలో మటన్‌కు బదులు చికెన్ పెట్టారని గొడవ.. కర్రలు, కుర్చీలతో దాడులు..
Saharsa Wedding Clash

ఇంటర్‌నెట్ డెస్క్: బిహార్‌లో దారుణం చోటుచేసుకుంది. పెళ్లిలో మటన్ కోసం చోటుచేసుకున్న గొడవ కారణంగా 12 మంది తీవ్రగాయాలపాలయ్యారు. పెళ్లి కూతురు తరఫు వారు మటన్ పెడతామని చెప్పి చికెన్ పెట్టడంతో పెళ్లి కుమారుడి తరఫు వారు ప్రశ్నించారు. దీంతో గొడవ మొదలై భీకర యుద్ధానికి దారి తీసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సహర్స జిల్లాలోని సిమ్రి భక్తియార్‌పూర్ పట్టణానికి చెందిన మహ్మద్ అన్వర్ కుమారుడు మహ్మద్ అబ్దుల్లాకు అదే ప్రాంతానికి చెందిన మహ్మద్ జావెద్ కుమార్తెతో పెళ్లి నిశ్చయం అయింది.


గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పెళ్లి కూతురి ఇంటి దగ్గర పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత అందరూ భోజనానికి వెళ్లారు. భోజనంలో భాగంగా పెళ్లి కూతురు తరఫు వారు అతిథులందరికీ చికెన్ వడ్డించారు. మటన్ పెడతామని చెప్పి చికెన్ పెట్టారంటూ పెళ్లి కుమారుడి బంధువులు గొడవకు దిగారు. ఆ గొడవ చిలికిచిలికి గాలివానలా మారింది. రెండు వర్గాలు పరస్పరం కర్రలు, కుర్చీలు, ఇతర వస్తువులతో దాడి చేసుకోవటం మొదలెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.


రెండు వర్గాల వారికి సర్ది చెప్పి గొడవను ఆపారు. ఈ సంఘటనలో 12 మందికి గాయాలు అయ్యాయి. గాయపడ్డవారిని పోలీసులు సబ్ డివిజినల్ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక, ఈ గొడవకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఇవి కూడా చదవండి

వెనక్కి తగ్గిన మెటా.. ఇన్‌స్టాగ్రామ్‌లో వివాదాస్పద ఏఐ ఫీచర్ తొలగింపు..

ఒప్పందం ఉల్లంఘిస్తే ప్రతీకార చర్యలు.. అమెరికాకు ఇరాన్ గట్టి హెచ్చరిక..

Updated Date - Jul 11 , 2026 | 10:48 AM