వెనక్కి తగ్గిన మెటా.. ఇన్‌స్టాగ్రామ్‌లో వివాదాస్పద ఏఐ ఫీచర్ తొలగింపు..
ABN , Publish Date - Jul 11 , 2026 | 10:20 AM
తీవ్ర విమర్శలు రావడంతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఇటీవల ప్రవేశపెట్టిన వివాదాస్పద ఏఐ ఫీచర్‌ను మెటా తొలగించింది. పబ్లిక్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లోని ఫొటోలను ఆధారంగా చేసుకుని ఏఐ సాయంతో కొత్త చిత్రాలను రూపొందించే ఫీచర్‌ను ఇటీవల మెటా విడుదల చేసింది.
తీవ్ర విమర్శలు రావడంతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఇటీవల ప్రవేశపెట్టిన వివాదాస్పద ఏఐ ఫీచర్‌ను మెటా తొలగించింది. పబ్లిక్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లోని ఫొటోలను ఆధారంగా చేసుకుని ఏఐ సాయంతో కొత్త చిత్రాలను రూపొందించే ఫీచర్‌ను ఇటీవల మెటా విడుదల చేసింది. అయితే వ్యక్తిగత గోప్యత, అనుమతి లేకుండా ఫొటోలను వినియోగించే అవకాశం ఉందంటూ తీవ్ర విమర్శలు రావడంతో మెటా వెనక్కి తగ్గింది (Instagram AI Feature).
'మ్యూస్ ఇమేజ్' పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్‌లో ఎవరిదైనా ఇన్‌స్టాగ్రామ్ ఐడీని నమోదు చేస్తే చాలు.. ఆ వ్యక్తి ఫొటోలను ఆధారంగా చేసుకుని ఏఐ కొత్త చిత్రాలను రూపొందిస్తుంది. ఈ ప్రక్రియలో వినియోగదారుల నుంచి స్పష్టమైన ముందస్తు అనుమతి తీసుకోకపోవడంపై హాలీవుడ్ సినీ రంగ సంస్థలు, కళాకారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు (Meta Removes AI Tool).
ఈ ఫీచర్‌ను ఉపయోగించి వ్యక్తుల రూపాన్ని మార్చడం, నకిలీ చిత్రాలు సృష్టించడం, మోసాలు లేదా దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. ముఖ్యంగా మహిళలు, ప్రజాప్రతినిధులు, ప్రముఖుల చిత్రాలను దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని పలు సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి (Technology News).
విమర్శలు పెరగడంతో మెటా అధికారికంగా స్పందించింది. ఈ ఫీచర్‌ను రూపొందించే సమయంలో వినియోగదారుల అభిప్రాయాలను సరైన విధంగా పరిగణనలోకి తీసుకోలేకపోయామని తెలిపింది. ఈ విషయంలో తమ అంచనా తప్పిందని అంగీకరించింది. ఆ ఫీచర్‌ను పూర్తిగా నిలిపివేసినట్లు ప్రకటించింది.
ఇవి కూడా చదవండి..
పెరిగిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..
ఇరాన్‌కు 24 గంటల గడువు.. హోర్ముజ్‌పై అమెరికా తుది హెచ్చరిక..