Share News

ఇరాన్‌కు 24 గంటల గడువు.. హోర్ముజ్‌పై అమెరికా తుది హెచ్చరిక..

ABN , Publish Date - Jul 11 , 2026 | 07:40 AM

హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలని, లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరాన్‌ను అమెరికా హెచ్చరించినట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.

ఇరాన్‌కు 24 గంటల గడువు.. హోర్ముజ్‌పై అమెరికా తుది హెచ్చరిక..
Strait of Hormuz

హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలని, లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరాన్‌ను అమెరికా హెచ్చరించినట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. హోర్ముజ్ జలసంధి అంతర్జాతీయ నౌకాయానానికి పూర్తిగా తెరిచి ఉంటుందని, వాణిజ్య నౌకలపై ఎలాంటి దాడులూ జరగవని 24 గంటల్లోగా ఇరాన్ బహిరంగంగా ప్రకటించాలని వాషింగ్టన్ స్పష్టం చేసినట్టు సమాచారం. లేనిపక్షంలో తీవ్రమైన సైనిక, ఆర్థిక చర్యలు తీసుకుంటామని అమెరికా హెచ్చరించినట్టు తెలుస్తోంది (US Warning Iran).


ఈ హెచ్చరికను మధ్యవర్తుల ద్వారా ఇరాన్‌కు అమెరికా చేరవేసినట్టు సమాచారం. 'నౌకలపై కాల్పులు ఆపేస్తామని బహిరంగంగా చెప్పాలి. అలాగే మేము తప్పు చేశామని వారు కనీసం పరోక్షంగానైనా అంగీకరించాలని మేము కోరుకుంటున్నాము. కాల్పులు ఆపేస్తామనేదే రేపు వారి ప్రకటన కావాలి. లేకపోతే వారికి అది మంచి రోజు కాబోదు' అని అమెరికా అధికారి హెచ్చరించినట్టు తెలుస్తోంది (Hormuz Deadline).


ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఒమాన్‌లో మధ్యవర్తిత్వ చర్చల్లో పాల్గొననున్నారు (US Iran, Strait of Hormuz). ఈ సమావేశం అనంతరం ఇరాన్ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని అమెరికా అధికారులు భావిస్తున్నారు. అయితే గడువులోగా స్పష్టమైన హామీ రాకపోతే పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Also Read:

తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?

ఈ డ్రై ఫ్రూట్స్‌ను మితంగా తినాలి.. ఎక్కువగా తింటే డేంజర్

Updated Date - Jul 11 , 2026 | 07:47 AM