‘నీలం, తోతాపురి కలర్’ ధరల పెరుగుదల
ABN , Publish Date - Jul 10 , 2026 | 12:25 PM
మామిడి కాయల సీజన్ మరో పది రోజుల్లో ముగియనుంది. ఇపుడు ధరలు పెరగడంతో మామిడి రైతులు కాస్త ఊరట చెందారు.
సీజన్ ఆఖరులో మామిడి రైతులకు కాస్త ఊరట
రైల్వేకోడూరు(తిరుపతి): మామిడి కాయల సీజన్ మరో పది రోజుల్లో ముగియనుంది. ఇపుడు ధరలు పెరగడంతో మామిడి రైతులు కాస్త ఊరట చెందారు. ప్రధానంగా తోతాపురి కలర్ కాయలు, నీలం కాయల ధరలు పుంజుకున్నాయి. నీలం రకం మొదటి రకం కాయలు (గ్రేడ్-1) టన్ను రూ.20వేల నుంచి రూ. 25వేలకు చేరింది. రెండో రకం (గ్రేడ్-2) టన్ను రూ.10వేల నుంచి రూ.15వేల వరకు ధర పలుకుతోంది.
ఈ కాయలను మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్, నాగపూర్, తమిళనాడు తదితర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారు. అలాగే తోతాపురి (కలర్ కాయలు) టన్ను రూ.8వేల నుంచి రూ.14వేల వరకు ధరలు పలుకుతున్నాయి. వీటి ధరలు పెరిగే అవకాశాలున్నాయని రైతులు, వ్యాపారులు అంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:\
‘మావిగన్ అంటే మామిడి పండు అనుకుంటున్నారామో’.. జగన్‌పై చింతా మోహన్ సెటైర్
మంత్రి నారాయణపై మార్ఫింగ్ ప్రచారం.. వైసీపీపై రూప్ కుమార్ తీవ్ర విమర్శలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News