Share News

నడి రోడ్డుపై ఈ మందుబాబు నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..

ABN , Publish Date - Jul 10 , 2026 | 07:30 AM

సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు నెటిజన్లను ఆకర్శిస్తుంటాయి. కొన్ని కడుపుబ్బా నవ్వులు పూయిస్తుంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉంటున్నాయి. తాాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది..

నడి రోడ్డుపై ఈ మందుబాబు నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..
Drunk Man Viral Video

ఇంటర్నెట్ డెస్క్: రోజూ సోషల్ మీడియా వేదికల్లో ఎన్నో రకాల స్టంట్లు, గొడవలు, వింత చేష్టలకు సంబంధించిన వీడియోలు దర్శనమిస్తుంటాయి. వాటిలో కొన్ని మాత్రమే ప్రజలను బాగా ఆకట్టుకుని వైరల్‌గా మారుతుంటాయి. తాజాగా, ఓ మందు బాబుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ నవ్వులు పూయిస్తోంది. వివరాల్లోకి వెళితే..


సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. రోడ్డుపై ఏదో ఎద్దు పడుకుని ఉంది. కానీ దగ్గరగా వెళ్లి చూసిన వారు.. ఒక్కసారిగా పగలబడి నవ్వుకుంటున్నారు. ఒక వ్యక్తి ఫుల్‌గా మందుకొట్టి.. ఎద్దు పొట్టపై తల పెట్టి హాయిగా నిద్రపోతున్నాడు. అతను రోడ్డుపై ఉన్నాడనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయి, తన బెడ్ రూంలో పడుకున్నట్లుగా ఎద్దుపై విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ విచిత్ర ఘటన ఏ ప్రాంతంలో జరిగిందో తెలీదు గానీ.. వీడియో మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.


ఈ వీడియో @gharkekalesh అనే యూజర్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. వీడియోను పోస్ట్ చేస్తూ.. 'రోడ్డుపై ఎద్దు ఒడిలో నిద్రిస్తున్న వ్యక్తి' అని క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ‘ఇదీ మద్యం పవర్ అంటే’ అని, ‘మంచి దిండు ఎంచుకున్నాడు’ అని ఒక నటిజన్, ‘ఇలాంటి సుఖం ఇంట్లో దొరకదు బ్రదర్’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.

Updated Date - Jul 10 , 2026 | 07:42 AM