Share News

వరదల్లో ప్రయాణికులకు దారి చూపిన 'స్పైడర్‌మ్యాన్'.. వీడియో వైరల్

ABN , Publish Date - Jul 09 , 2026 | 09:26 AM

మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు భివండిలో రోడ్లు జలమయం అవగా.. స్థానిక నివాసి షాదాబ్ 'స్పైడర్‌మ్యాన్' వేషధారణలో వీధుల్లోకి వచ్చి, ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చి నిజమైన సూపర్‌హీరో అనిపించుకున్నాడు..

వరదల్లో ప్రయాణికులకు దారి చూపిన 'స్పైడర్‌మ్యాన్'.. వీడియో వైరల్
Real Life Spider Man

ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేశాయి. భివండిలోని పలు ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీరు చేరడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా వరద నీటిలో స్పైడర్ మ్యాన్ వేషధారణలో ఉన్న ఓ వ్యక్తి చేసిన పని.. అందరి ప్రశంసలను అందుకుంటోంది.


ఆ వేషధారణలోనే బురద నీటిని సైతం లెక్కచేయకుండా రోడ్లపై నిలిచిపోయిన వర్షపు నీటిని తొలగించడంలో సహాయపడ్డాడు. అంతేకాకుండా, మోకాళ్ల లోతు నీటిలో చిక్కుకుపోయిన వాహనదారులకు ప్రమాదకరమైన గుంతలు లేని సురక్షితమైన మార్గాలను చూపిస్తూ, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి గంటల తరబడి శ్రమించాడు. ఒక సామాన్య పౌరుడు సమాజం పట్ల చూపిన ఈ చొరవ అందరినీ ఆలోచింపజేసింది. స్పైడర్‌మ్యాన్ రూపంలో ఉన్న షాదాబ్ వరద నీటిలో నిలబడి నిస్వార్థంగా సేవ చేస్తున్న దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలు ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేసిన కొద్దిసేపట్లోనే విపరీతంగా వైరల్ అయ్యాయి.

వైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్లు రక రకాలుగా స్పందించారు. ఓ నెటిజన్ 'స్పైడర్‌మ్యాన్- ఎప్పటికీ ఇంటికి చేరలేడు' అంటూ కామెంట్ చేయగా, ‘నాకేమిటి లాభం? అనే వాళ్లు నిన్ను చూసి నేర్చుకోవాలి’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. కష్ట కాలంలో స్పందించి నిజ జీవిత సూపర్‌హీరోలా నిలిచిన షాదాబ్ నిస్వార్థతపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

సెల్‌ఫోన్ ఫ్లాష్ లైట్ వెలుగులో రైల్వేట్రాక్‌‌పై ప్రయాణికుల నడక.. వీడియో వైరల్

రూ.15 విలువైన ఆర్డర్‌కు రూ.500 టిప్పు.. డెలివరీ బాయ్ రియాక్షన్ వీడియో వైరల్

For More Viral News And Telugu News

Updated Date - Jul 09 , 2026 | 10:03 AM