ఇదేం టార్చర్ రా బాబూ.. కొడుకు ఎత్తు పెరగాలని..
ABN , Publish Date - Jul 08 , 2026 | 04:44 PM
ఒక జంట తమ బిడ్డను డోర్ ఫ్రేమ్‌కు వేలాడదీసిన ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. తమ బిడ్డ ఎత్తు పెరిగేందుకు ఇలా చేశామన్న వారిపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: తల్లిదండ్రులు తమ పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. వారికి చిన్న ఇబ్బందిని కూడా కలుగనీయరు. ఇందుకు భిన్నంగా ఓ చిన్నారిని అతడి తల్లిదండ్రులే అపోహల బారినపడి టార్చర్ పెట్టిన ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, తమ బిడ్డ ఎత్తు పెరగాలన్న తాపత్రయంలో ఒక బాలుడి తల్లిదండ్రులు హద్దు మీరారు. ఆ బాలుడిని తండ్రి స్వయంగా డోర్ ఫ్రేమ్ నుంచి వేలాడదీశాడు. చిన్నారి ఇబ్బంది పడుతున్నా ఆ తల్లిదండ్రులు పట్టించుకోలేదు. ఇదంతా చూసిన పొరుగింటి మహిళ మాత్రం షాకైపోయింది. వెంటనే బాలుడి తల్లిని నిలదీసింది. ఇదేం చార్చర్ అంటూ మండిపడింది. వారు చేస్తున్న దారుణాన్ని కెమెరాలో రికార్డు చేసింది.
పొరుగింటి మహిళ నిలదీస్తున్నప్పటికీ బాలుడి తల్లి మాత్రం తమ చర్యలను సమర్థించుకునే ప్రయత్నం చేసింది. ఇది టార్చర్ ఎలా అవుతుందని ఎదురు ప్రశ్నించింది. మా ఇంట్లో ఏం జరుగుతోందో మీకెలా అర్థం అవుతుందని ఎదురు ప్రశ్నించింది. ఈలోపు తండ్రి ఆ చిన్నారిని కిందకు దించేశాడు. పిల్లాడి ఎత్తు పెంచాలనే ఇలా చేశాం తప్ప దురుద్దేశం ఏమీ లేదని వివరించే ప్రయత్నం చేశాడు.
ఇక ఈ వీడియో వైరల్ కావడంతో జనాలు ఆ దంపతులపై దుమ్మెత్తిపోస్తున్నారు. చిన్నారిని అలా వేలాడదీస్తే బరువు పెరగడని కుండబద్దలు కొట్టారు. దేశంలో ఎందరో తల్లిదండ్రులకు ఇదే అపోహ ఉందని నెటిజన్లు విచారం వ్యక్తం చేశారు. పిల్లల్ని వేలాడదీస్తే ఎత్తు పెరుగుతారనేందుకు ఎలాంటి శాస్త్రపరమైన ఆధారాలు లేవని తేల్చి చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
సెల్ ఫోన్ ఫ్లాష్ లైట్ వెలుగులో రైల్వే ట్రాక్‌పై ప్రయాణికుల నడక.. వీడియో వైరల్
రైలు ఆపి సమోసాలు కొన్న లోకో పైలట్.. వీడియో వైరల్