రైలు ఆపి సమోసాలు కొన్న లోకో పైలట్.. వీడియో వైరల్
ABN , Publish Date - Jul 08 , 2026 | 03:18 PM
సమోసాల కోసం ఓ లోకో పైలట్ రైలు ఆపి.. సమీపంలోని దుకాణానికి వెళ్లి సమోసా కొన్నాడు. ఆ వీడియో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్ ఇందౌర్‌లోని రంగ్వాసా ప్రాంతంలో రైలును లోకో పైలట్ నిలిపివేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: సమోసాల కోసం ఓ లోకో పైలట్ రైలు ఆపి.. సమీపంలోని దుకాణానికి వెళ్లి సమోసా కొన్నాడు. ఆ వీడియో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్ ఇందౌర్‌లోని రంగ్వాసా ప్రాంతంలో రైలును లోకో పైలట్ నిలిపివేశాడు. అందులో నుంచి దిగి సమీపంలో ఉన్న ఓ దుకాణానికి వెళ్లి సమోసాలు కొనుగోలు చేశాడు. అనంతరం రైలు ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఈ ఘటనను స్థానికులు వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతడిపై చర్యలు తీసుకోవాలని రైల్వే శాఖను వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో రైల్వే అధికారుల దృష్టికి వెళ్లింది. దీనిపై విచారణకు ఆదేశించినట్లు రైల్వే శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
సెల్‌ఫోన్ ఫ్లాష్ లైట్ వెలుగులో రైల్వేట్రాక్‌పై ప్రయాణికుల నడక.. వీడియో వైరల్
రూ.15 విలువైన ఆర్డర్‌కు రూ.500 టిప్పు.. డెలివరీ బాయ్ రియాక్షన్ వీడియో వైరల్
For More Viral News And Telugu News