చిన్నారిని చూసి మురిసిపోయిన ఎయిర్‌హోస్టెస్.. చివరికి ఏం చేసిందంటే..
ABN , Publish Date - Jul 08 , 2026 | 01:20 PM
సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో రోజూ వేలాది వీడియోలు షేర్ అవుతుంటాయి. వాటిలో కొన్ని నవ్వులు పూయిస్తే, మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అయితే, కొన్ని వీడియోలు మాత్రం నేరుగా మన మనసును తాకుతాయి. అలాంటి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: మొదటిసారి విమానంలో ప్రయాణిస్తున్న ఓ చిన్నారిపై ఎయిర్‌హోస్టెస్ చూపించిన ప్రేమ అందరి హృదయాలనూ గెలుచుకుంది. ఈ క్యూట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. పిల్లలు దేవుడితో సమానమని, వారి అమాయకత్వం ఎవరినైనా కట్టిపడేస్తుందని ఈ వీడియో చూస్తే మనకు మరోసారి అర్థమవుతుంది. విమానంలో చిన్నారిని చూడగానే అక్కడి ఎయిర్‌హోస్టెస్ ఎంతో మురిసిపోయింది. ఆ పాప క్యూట్‌నెస్‌కు ఫిదా అయిపోయిన ఆమె.. చివరకు ఏం చేసిందో మీరే చూడండి..
ఈ వీడియో ‘_gemuz’ అనే యూజర్ ద్వారా ఎఇన్‌స్టాగ్రామ్ షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటికే లక్షలాది మంది వీక్షించగా, ఒక లక్షా 68 వేలకు పైగా నెటిజన్లు దీనిని లైక్ చేశారు. ఓ నెటిజన్ ‘నిజంగా హృదయాన్ని హత్తుకునే అద్భుతమైన దృశ్యం’ అని, ‘చాలా క్యూట్ మూమెంట్’ అంటూ కామెంట్ చేశారు. డ్యూటీ ఒత్తిడిలోనూ ఆ చిన్నారితో ఎయిర్‌హోస్టెస్ సరదాగా గడిపిన ఈ వీడియోను చూసే కొద్దీ మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తోందంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
అదృశ్యమైన పాకిస్థాన్ కార్గో విమానం.. అరేబియా సముద్రంలో గాలింపు..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..