Share News

కొత్తరకం స్కెచ్.. ఖరీదైన ఫోన్‌ను ఎలా కొట్టేశారో చూస్తే..

ABN , Publish Date - Jul 08 , 2026 | 07:43 AM

హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో కొత్తరకం దొంగతనం వెలుగుచూసింది. ప్రమాదంలో పడిన వ్యక్తిని కాపాడబోయిన ఒక పాదచారినే మోసం చేశారు. అతడికి తెలీకుండానే ఎంతో తెలివిగా ఖరీదైన ఫోన్‌ను కొట్టేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది..

కొత్తరకం స్కెచ్.. ఖరీదైన ఫోన్‌ను ఎలా కొట్టేశారో చూస్తే..
Saroor Nagar Theft

హైదరాబాద్‌, జులై 8: నగరంలోని సరూర్‌నగర్‌లో కొత్తరకం దొంగతనం వెలుగుచూసింది. ఇద్దరు వ్యక్తులు ఎంతో తెలివిగా ఓ పాదచారిని మోసం చేశారు. కళ్లు మూసి తెరిచేలోపు దొంగలు అతని ఖరీదైన ఫోన్‌ను కొట్టేసిన ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. రోడ్డు దాటుతున్న ఒక పాదచారిని లక్ష్యంగా చేసుకుని దొంగలు ఈ స్కెచ్ వేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి.


సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. బైక్‌పై వచ్చిన ఒక వ్యక్తి అకస్మాత్తుగా రోడ్డు మధ్యలోకి వెళ్లి యూ-టర్న్ తీసుకోవడానికి మళ్లించాడు. ఈ క్రమంలో ఉద్దేశపూర్వకంగానే బైక్‌పై నియంత్రణ కోల్పోయినట్లు నటిస్తూ రోడ్డుపై పడిపోతున్నట్లు నటించాడు. అక్కడే ఉన్న పాదచారి.. పరుగెత్తుకుంటూ వచ్చి ఆ బైకర్‌ను కిందపడకుండా సాయం పట్టుకున్నాడు. అయితే అప్పుడే మరో వ్యక్తి కూడా అక్కడికి వచ్చాడు. పాదచారి పూర్తి దృష్టి మరల్చి.. ఎంతో చాకచక్యంగా పైజేబులో ఉన్న ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ను దొంగిలించాడు. బాధితుడు ఏం జరిగిందో గ్రహించేలోపే నిందితులిద్దరూ బైక్‌పై అక్కడి నుంచి ఉడాయించారు.


అప్రమత్తమైన పాదచారి దొంగలను వెంబడించేందుకు ప్రయత్నించినప్పటికీ, అప్పటికే వారు మాయమైపోయారు. కేవలం నిమిషంలోపే ముగిసిన ఈ దొంగతనం ఉదంతం, దొంగలు ఎంత ప్రణాళికాబద్ధంగా దృష్టి మరల్చే ఎత్తుగడలను ఉపయోగిస్తున్నారో స్పష్టం చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భారత్‌లో ఫోన్ భద్రతపై విదేశీయురాలి వ్యాఖ్యలు.. వీడియో వైరల్

బొమ్మలా పరుగులు తీస్తున్న రెయిన్ ట్రైన్.. వీడియో వైరల్

For More Viral News And Telugu News

Updated Date - Jul 08 , 2026 | 08:55 AM