Share News

బొమ్మలా పరుగులు తీస్తున్న రెయిన్ ట్రైన్.. వీడియో వైరల్

ABN , Publish Date - Jul 07 , 2026 | 03:43 PM

టెక్ మహీంద్ర చైర్మన్ ఆనంద్ మహీంద్ర ఓ వీడియో‌ను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్‌గా మారింది. ఇది నిజమైనదేనా అనే సందేహం నెటిజన్లలో కలుగుతుంది.

బొమ్మలా పరుగులు తీస్తున్న రెయిన్ ట్రైన్.. వీడియో వైరల్
RainTrain in Siliguri

ఇంటర్నెట్ డెస్క్: వర్షాకాలంలో ప్రకృతి అంతటా పచ్చదనం పరుచుకుంటుంది. దాంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. ఈ సమయంలో విహారయాత్రకు వెళ్లాలని చాలా మంది అనుకుంటారు. అలాంటి ట్రిప్ చేయాలని ఎదురు చూస్తున్న వారి కోసం టెక్ మహీంద్ర చైర్మన్ ఆనంద్ మహీంద్ర ఓ వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియో కథల పుస్తకంలోని దృశ్యంలా ఉంది. ఇది నిజమేనా? అనే అంతగా సందేహం కలుగుతుంది. ఈ రెయిన్ ట్రైన్ పశ్చిమబెంగాల్‌లో సిలిగురి సమీపంలో ప్రయాణిస్తుంది.


చుట్టూ పచ్చని చెట్లు. చిన్నగా వర్షం పడుతుంది. ఒకే రైలు ట్రాక్‌ ఉంది. అది కూడా రహదారికి సమాంతరంగా ఉంది. ఈ ట్రైన్‌లో రెండు బోగీలు మాత్రమే ఉన్నాయి. ఆ ట్రాక్‌పై సాధారణ వేగంతో కదులుతున్న రైలు.. నిజంగా ఓ బొమ్మలాగానే ఉంది. దీంతో సిలిగురి రెయిన్ ట్రైన్‌ను చిత్రాల పుస్తకంగా టెక్ మహీంద్ర చైర్మన్ అభివర్ణించారు. వర్షాకాలపు మాయాజాలం కోసం వెతుకుతున్నారా? సిలిగురిలోని రెయిన్ ట్రెయిన్‌లో ప్రయాణించండి అంటూ ప్రకృతి ప్రేమికులకు సూచించారు. నిజం చెప్పాలంటే.. దీనితో విభేదించడం కష్టమని ఆయన స్పష్టం చేశారు.


వర్షంతోపాటు పొగమంచుతో కప్పబడిన అడవుల్లో ఈ ప్రఖ్యాత డార్జిలింగ్ హిమాలయన్ రైలు కదులుతోంది. వర్షాకాలం పచ్చదనంతోపాటు భారీ వృక్షాల మధ్య ఈ బ్లూ రంగు రైలు కదులుతుంటే.. ఇది నిజమేనా? అన్నంతగా అనుమానం కలుగుతోంది. ఇందులో ప్రయాణించే ప్రయాణికులు.. రైలు కిటికీలో నుంచి బయట కనిపించే ప్రతి క్షణాన్ని ఆస్వాదించే విధంగా ఉంది. గమ్యం గురించి ఆలోచించడం కూడా మానేసే అంతగా మాయ చేయడం ఈ ప్రయాణంలో ఉంది. వర్షాకాలం కోసమే ప్రత్యేకంగా రూపొందించిన రైలు ప్రయాణం ఏదైనా ఉందంటే.. అది ఇదే అనే విధంగా ఉంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.


ఇది అందమైన కలలా ఉంది. ఇది నిజమేనా అని ఓ నెటిజన్ సందేహం వ్యక్తం చేశారు. వర్షాకాలంలో సిలిగురిలో ప్రయాణం చేసే ప్రతి యాత్రికుడు పొందాల్సిన అనుభవం అని కామెంట్ చేశారు. ఇంకొకరు.. వావ్ ఒక్క క్షణం ఇది ఏఐ (AI) వీడియో అనుకున్నానని పేర్కొన్నారు. ఈ వీడియోను చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బామ్మ డెడ్‌లిఫ్ట్.. వీడియో వైరల్

నడి రోడ్డుపై నటుడు పడవ ప్రయాణం.. వీడియో వైరల్

For More Viral News And Telugu News

Updated Date - Jul 07 , 2026 | 04:56 PM