Share News

బామ్మ డెడ్‌లిఫ్ట్.. వీడియో వైరల్

ABN , Publish Date - Jul 06 , 2026 | 05:34 PM

ఎవరికైనా వయస్సు పెరిగే కొద్దీ శక్తి తగ్గిపోతుంది. సరిగ్గా నడవలేరు. వారి పనులు కూడా సరిగ్గా చేసుకోలేరు. తింటే ఆయాసం.. తినకపోతే నీరసం అన్నట్లుగా పరిస్థితి ఉంటుంది. దీంతో ఏం తినాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించి తింటారు.

బామ్మ డెడ్‌లిఫ్ట్.. వీడియో వైరల్
Roshni Devi Sangwan

ఇంటర్నెట్ డెస్క్: ఎవరికైనా వయస్సు పెరిగే కొద్దీ శక్తి తగ్గిపోతుంది. సరిగ్గా నడవలేరు. వారి పనులు కూడా సరిగ్గా చేసుకోలేరు. తింటే ఆయాసం.. తినకపోతే నీరసం అన్నట్లుగా పరిస్థితి ఉంటుంది. దీంతో ఏం తినాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించి తింటారు. అయితే, కొందరికి మాత్రం వయస్సు అనేది కేవలం ఓ సంఖ్య మాత్రమే. ఏమైనా చేయగలరు. బరువులు ఎత్తుతారు. పరిగెత్తుతారు. ఏమైనా తినేస్తారు. అలాంటి వారికి చాలా ఫిట్‌గా ఉండే యువతి యువకులు కూడా సలాం కొట్టాల్సిందే. ఓ 70 ఏళ్ల బామ్మ 103 కిలోల బరువును ఎత్తిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆమె ఈ బరువును డెడ్‌లిఫ్ట్ (Deadlift) చేసిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.


అంతే కాదు.. ఈ వీడియోను వెయిట్‌లిఫ్టర్‌మమ్మీ అనే ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో షేర్ చేసింది. ఈ వీడియోను ఇప్పటి వరకు లక్షలాది మంది చూశారు. దాదాపు 29 లక్షల మంది ఈ వీడియోకు లైక్‌ చేశారు. బామ్మపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ బామ్మ సంచలనం సృష్టించిందని కొందరు పేర్కొంటున్నారు. చాలా మందికి ఈ బామ్మ ఆదర్శమని అంటున్నారు.


బామ్మ పేరు రోహిణి దేవి సాంగ్వాన్. ఆమె వెయిట్‌లిఫ్టర్. 68 ఏళ్ల వయస్సులో కీళ్ల నొప్పులు తగ్గించుకోవడానికి ఫిట్‌నెస్ ప్రయాణం మొదలుపెట్టారు. ఆమె ప్రస్తుతం 105 కిలోల బరువును కూడా అవలీలగా ఎత్తగలరు. దీంతో వెయిట్‌లిఫ్టర్ మమ్మీగా దేశవ్యాప్తంగా పేరు పొందారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నడి రోడ్డుపై నటుడు పడవ ప్రయాణం.. వీడియో వైరల్

పొలంలో బాలికల డ్యాన్స్.. నెటిజన్ల హృదయాలను దోచుకున్న వీడియో వైరల్

For More Viral News And Telugu News

Updated Date - Jul 06 , 2026 | 06:20 PM