నడి రోడ్డుపై నటుడు పడవ ప్రయాణం.. వీడియో వైరల్
ABN , Publish Date - Jul 06 , 2026 | 02:55 PM
ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దాంతో నగరంలోని రహదారులు.. కాలువలను తలపిస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దాంతో నగరంలోని రహదారులు.. కాలువలను తలపిస్తున్నాయి. ఆ నీటిలో బాలీవుడ్ నటుడు అయాజ్ అహ్మద్ ఎయిర్ బోట్ నడిపాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది వైరల్‌గా మారింది. ఈ వీడియోకు ‘ప్రతి వర్షాకాలంలో ముంబైకర్’ అనే క్యాప్షన్ పెట్టాడు. ఈ వీడియోలో అయాజ్ అహ్మద్ చేతితో గొడుగు పట్టుకున్నారు. అంధేరిలోని వీరాదేశాయ్ రోడ్డులో మోకాలి లోతు నీటిలో ‘ఎక్స్‌ప్లోరర్ 200’ అనే నారింజ రంగు ఎయిర్ బోటులో ఆయన ప్రయాణించారు.
ముంబైలో వాస్తవ పరిస్థితిని వివరించడం కోసం ఆయన ఈ వీడియో చేసినట్లుగా ఉంది. ఈ వీడియోలో వాటర్ టూ మచ్ అంటూ ఆడియోను ఉపయోగించారు. ఈ వీడియో పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే వైరల్‌గా మారింది. 13 వేలకుపైగా లైకులు వచ్చాయి. 4.5 లక్షల మంది నెటిజన్లు ఈ వీడియోను చూశారు.
ఈ వీడియోపై పలువురు సెలబ్రిటీలు ఎమోజీలను పోస్ట్ చేసి.. అయాజ్ అహ్మద్ వీడియోను ప్రశంసించారు. అయితే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)పై నెటిజన్లు మండిపడుతున్నారు. ముంబైలో కొత్త రిక్షాను ప్రారంభించారని వ్యంగ్యంగా అన్నారు. దేశంలో బీఎంసీ అత్యధిక ధనిక మున్సిపల్ కార్పొరేషన్ అని మరో నెటిజన్ గుర్తు చేశారు. అయినా ప్రతి ఏడాది ఇదే పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు.
అంధేరి సబ్ వే, మరోల్, మలాడ్ ఎస్వీ రోడ్ల పరిస్థితి ఎప్పుడు మెరుగుపడతాయని ప్రశ్నించారు. భారీ వర్షాలతో ముంబై మహానగరంలోని పరిస్థితులు తీవ్రంగా మారాయి. తక్కువ సమయంలో దాదాపు 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో.. మురుగు కాలువలు కూడా పొంగిపొర్లుతున్నాయి. రహదారులపై భారీగా వర్షపు నీరు నిలవడంతో.. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పొలంలో బాలికల డ్యాన్స్.. నెటిజన్ల హృదయాలను దోచుకున్న వీడియో వైరల్
ఒక్క ప్రశ్నతో ఉద్యోగం పోయింది.. కెనడాలో భారతీయుడి ఇంటర్వ్యూ అనుభవం వైరల్..
For More Viral News And Telugu News