ఒక్క ప్రశ్నతో ఉద్యోగం పోయింది.. కెనడాలో భారతీయుడి ఇంటర్వ్యూ అనుభవం వైరల్..
ABN , Publish Date - Jul 06 , 2026 | 11:09 AM
కెనడాలో నివసిస్తున్న భారతీయ ప్రొడక్ట్ మేనేజర్ కరణ్ గొగ్నా పంచుకున్న తన ఇంటర్వ్యూ అనుభవం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గతంలో తాను హాజరైన ఓ ఇంటర్వ్యూ గురించి లింక్డిన్ ద్వారా పంచుకున్నారు.
కెనడాలో నివసిస్తున్న భారతీయ ప్రొడక్ట్ మేనేజర్ కరణ్ గొగ్నా పంచుకున్న తన ఇంటర్వ్యూ అనుభవం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గతంలో తాను హాజరైన ఓ ఇంటర్వ్యూ గురించి లింక్డిన్ ద్వారా పంచుకున్నారు. ఆ ఇంటర్వ్యూలో తాను దాదాపు అన్ని రౌండ్లను విజయవంతంగా పూర్తి చేసినప్పటికీ, చివరి దశలో సీఈవోను అడిగిన ఒక్క ప్రశ్న కారణంగా ఉద్యోగ అవకాశాన్ని కోల్పోయానని ఆయన వెల్లడించారు (Indian in Canada).
కెనడాలో సెకెండ్ హ్యాండ్ కార్ల వ్యాపారాన్ని నిర్వహించే ఓ స్టార్టప్ కంపెనీలో ఉద్యోగం కోసం కరణ్ దరఖాస్తు చేశారు. అన్ని రౌండ్లను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత హెచ్‌ఆర్ విభాగం అవసరమైన పత్రాలు కూడా కోరింది. దీంతో ఉద్యోగం ఖాయమైందని కరణ్ భావించారు. అయితే కంపెనీ సీఈవోతో చివరి సమావేశం ఉంటుందని హెచ్‌ఆర్ విభాగం సమాచారం ఇచ్చింది. సీఈవోతో ఇంటర్వ్యూ కూడా బాగానే సాగింది (Job interview).
ఇంటర్వ్యూ చివర్లో 'మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా' అని కరణ్‌ను సీఈవో అడిగారు. 'మీ కంపెనీ ద్విచక్ర వాహనాల మార్కెట్‌లోకి ప్రవేశించే ఆలోచనలో ఉందా?' అని సీఈవోను కరణ్ ప్రశ్నించారు. దానికి సీఈవో స్పందిస్తూ.. 'మీ అభిప్రాయం ఏమిటి? మేము ఆ మార్కెట్‌లోకి వెళ్లాలా?' అని తిరిగి ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు తాను తడబడుతూ సమాధానం ఇచ్చానని, ఎందుకంటే టూ వీలర్ మార్కెట్ గురించి తాను సమాచారం సేకరించలేదని కరణ్ పేర్కొన్నారు (CEO interview Karan Gogna).
మరుసటి రోజే కంపెనీ హెచ్ఆర్ విభాగం కాల్ చేసి మరో అభ్యర్థిని ఎంపిక చేసుకున్నట్లు తెలిపిందని కరణ్ చెప్పారు (Interview tips). ఈ అనుభవం నుంచి తాను నేర్చుకున్న పాఠాన్ని కూడా కరణ్ పంచుకున్నారు. ఇంటర్వ్యూకు వెళ్లే అభ్యర్థులు కేవలం సమాధానాలపైనే కాకుండా, తాము అడగాల్సిన ప్రశ్నల గురించి కూడా సమాచారం సేకరించాలని సూచించారు. అభ్యర్థులు అడిగే ప్రశ్నలు వారి ఆలోచనా విధానాన్ని, వ్యూహాత్మక దృష్టిని అంచనా వేయడానికి ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
మాకు భారత్ లాంటి మిత్రదేశాలున్నాయి.. జేడీ వాన్స్‌కు నెతన్యాహు కౌంటర్
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..