లాభాల్లో దేశీయ సూచీలు.. 375 పాయింట్ల పైకి సెన్సెక్స్..
ABN , Publish Date - Jul 06 , 2026 | 10:14 AM
రాబోయే రోజుల్లో బ్యాంకింగ్ సెక్టార్ భారీ లాభాలు ఆర్జించనుందనే అంచనాలు వెలువడిన నేపథ్యంలో ఆ రంగ సూచీలపై మదుపర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. మరోవైపు గత సెషన్‌లో విదేశీ మదుపర్లు రూ.1355 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.
రాబోయే రోజుల్లో బ్యాంకింగ్ సెక్టార్ భారీ లాభాలు ఆర్జించనుందనే అంచనాలు వెలువడిన నేపథ్యంలో ఆ రంగ సూచీలపై మదుపర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. మరోవైపు గత సెషన్‌లో విదేశీ మదుపర్లు రూ.1355 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు కూడా సూచీలను ముందుకు నడిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కదలాడుతున్నాయి. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 95.26గా ఉంది (Indian stock market).
గత సెషన్ ముగింపు (77,138)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం దాదాపు 200 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగిస్తోంది. ఉదయం 10:00 గంటల సమయంలో సెన్సెక్స్ 370 పాయింట్ల లాభంతో 78,132 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 107 పాయింట్ల లాభంతో 24,378 వద్ద కదలాడుతోంది (stock market news today).
సెన్సెక్స్, నిఫ్టీలో వెర్నోవా టీడీ, రాడికో కైతాన్, హిటాచీ ఎనర్జీ, సీజీ పవర్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎమ్‌సీఎక్స్ ఇండియా, సుజ్లాన్ ఎనర్జీ, కేపీఐటీ టెక్, బీఎస్ఈ లిమిటెడ్ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 345 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 130 పాయింట్ల లాభంతో ఉంది.
ఇవి కూడా చదవండి..
మాకు భారత్ లాంటి మిత్రదేశాలున్నాయి.. జేడీ వాన్స్‌కు నెతన్యాహు కౌంటర్
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..