పొలంలో బాలికల డ్యాన్స్.. నెటిజన్ల హృదయాలను దోచుకున్న వీడియో వైరల్
ABN , Publish Date - Jul 05 , 2026 | 08:04 PM
ఏరువాక పౌర్ణమితో దేశంలోని వివిధ ప్రాంతాల్లో పొలం పనులు ప్రారంభమయ్యాయి. తొలకరి కూడా పలకరించడంతో.. వరి నాట్లు ఊపందుకున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఏరువాక పౌర్ణమితో దేశంలోని వివిధ ప్రాంతాల్లో పొలం పనులు ప్రారంభమయ్యాయి. తొలకరి కూడా పలకరించడంతో.. వరి నాట్లు ఊపందుకున్నాయి. పొలంలో పని చేస్తున్న ఇద్దరు బాలికల సాధారణ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చుట్టు పెద్ద సెట్టింగులు లేవు. వారు ఖరీదైన దుస్తులు వేసుకోలేదు. డ్యాన్స్ షో కూడా కాదు.. అయినా వారు చక్కగా డ్యాన్స్ చేస్తూ తమ అమాయకపు చిరునవ్వుతో నెటిజన్ల మనస్సును దోచుకుంటున్నారు. గ్రామీణ వాతావరణంలో చుట్టూ పంట పొలాలు కనిపిస్తున్నాయి. బాలిక తన చేతిలోని వరి నారును పొలంలో పెట్టింది. అంతలో పల్కీ మే హోకే సవార్ చలి రే.. పాట ప్రారంభం అయింది. వారు పని ఆపేసి.. ఆ పాటకు అనుగుణంగా డ్యాన్స్ చేయడం మెదలు పెట్టారు.
ఆనందంతో చిరునవ్వులు చిందిస్తూ వాళ్లు డ్యాన్స్ చేస్తున్నారు. దుస్తులకు మట్టి అంటిన విషయాన్ని కూడా వారు లెక్క చేయకుండా.. డ్యాన్స్ చేస్తున్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ వీడియో చూస్తే.. ఒత్తిడి మాయమవుతుందని అంటున్నారు. నిజమైన ఆనందం ఖరీదైన వస్తువుల్లో ఉండదని.. ఇలాంటి చిన్న చిన్న క్షణాల్లోనే ఉంటుందని వారు స్పష్టం చేస్తున్నారు.
గ్రామీణ ప్రాంతంలో ఉండే నిరాడంబర జీవనంతోపాటు అమాయకమైన బాల్యాన్ని ఈ వీడియోలో చూడవచ్చని కామెంట్ చేస్తున్నారు. అదీకాక.. ఆకాశం మేఘావృతమై ఉండడం. ఆ పక్కనే ఒక బాలుడు గొడుగు పట్టుకుని పొలంలో వరినాట్లు వేయడం కూడా ఈ వీడియోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని నెటిజన్లు వివరిస్తున్నారు.