భారత్‌లో ఫోన్ భద్రతపై విదేశీయురాలి వ్యాఖ్యలు.. వీడియో వైరల్
ABN , Publish Date - Jul 07 , 2026 | 04:30 PM
లండన్‌లో కంటే భారత్‌లోనే ప్రశాంతంగా తన ఫోన్‌ను వినియోగించినట్లు విదేశీయురాలు ఎమ్మా వెల్లడించారు. ఆమె వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇంటర్నెట్ డెస్క్: లండన్‌లో కంటే భారత్‌లోనే ప్రశాంతంగా తన ఫోన్‌ను వినియోగించినట్లు విదేశీయురాలు ఎమ్మా వెల్లడించారు. ఆమె వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భారత్ పర్యటనకు వచ్చే ముందు తన వస్తువులు పట్ల అప్రమత్తంగా ఉండాలని.. బహిరంగ ప్రదేశాల్లో ఫోన్ బయట పెట్టకుండా ఉండాలంటూ పలు హెచ్చరికలు తాను విన్నానని తెలిపారు. కానీ దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శించిన తర్వాత.. తాను విన్న దానికి, ఊహించిన దానికి పూర్తిగా భిన్నంగా ఉందని ఆమె వివరించారు. ఈ వీడియో చర్చకు దారి తీసింది.
తన ప్రయాణ విశేషాలను ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమ్మా పంచుకున్నారు. కేరళం, వర్కాల, గౌహతి, మేఘాలయ తదితర ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు స్వేచ్ఛగా వీడియోలు చిత్రీకరిస్తున్న దృశ్యాలను వీడియో రూపంలో ఆమె పోస్ట్ చేశారు. లండన్‌తో పోలిస్తే భారత్‌లో తన ఫోన్ విషయంలో తనకు తక్కువ ఒత్తిడి అనిపించిందని చెప్పారు. ఇది వినడానికి బహుశా వివాదాస్పదంగా అనిపించవచ్చని అభిప్రాయపడ్డారు.
ఫోన్ చేతితో పట్టుకుని స్వేచ్ఛగా తిరుగుతూ వీడియోలు తీయగలిగానని.. అలాగే సామాన్ల భద్రత గురించి కూడా తాను ఎప్పుడూ ఆందోళన చెందలేదని తెలిపారు. లండన్‌లో మాత్రం తన ఫోన్ దాదాపు తన బ్యాగులోనే ఉండేదని ఈ వీడియో ద్వారా సోదాహరణగా వివరించారు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందించారు.
దేశంలో తరచూ గమనించిన ఓ విషయం ఈ వీడియో ద్వారా బహిర్గతమైందని ఓ నెటిజన్ పేర్కొన్నారు. భద్రత అనేది ప్రాంతాన్ని బట్టి మారుతుందని.. ఏ ప్రదేశమూ పూర్తిగా ప్రమాద రహితం కాదని వివరించారు. ఈ వీడియోను రూపొందించినందుకు ధన్యవాదాలు అని మరో నెటిజన్ చెప్పారు. ఇది నిజమని ఇంకో నెటిజన్ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బొమ్మలా పరుగులు తీస్తున్న రెయిన్ ట్రైన్.. వీడియో వైరల్
వరద నీటిలో చిక్కుకున్న కుక్క.. చివరకు ఏమైందంటే..
For More Viral News And Telugu News