అదృశ్యమైన పాకిస్థాన్ కార్గో విమానం.. అరేబియా సముద్రంలో గాలింపు..
ABN , Publish Date - Jul 08 , 2026 | 07:21 AM
పాకిస్థాన్‌కు చెందిన ఓ కార్గో విమానం అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. కే2 ఎయిర్‌వేస్‌కు చెందిన బోయింగ్ 737 విమానం మంగళవారం షార్జా నుంచి కరాచీకి బయలుదేరింది.
పాకిస్థాన్‌కు చెందిన ఓ కార్గో విమానం అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. కే2 ఎయిర్‌వేస్‌కు చెందిన బోయింగ్ 737 విమానం మంగళవారం షార్జా నుంచి కరాచీకి బయలుదేరింది. మంగళవారం రాత్రి కరాచీకి సుమారు 155 నాటికల్ మైళ్ల దూరంలో అరేబియా సముద్రంపై ప్రయాణిస్తున్న సమయంలో నావిగేషన్ వ్యవస్థలో సమస్య ఉందని పైలట్లు తెలియజేశారు (Pakistan cargo plane missing).
నావిగేషన్‌లో సమస్య ఉందని తెలియజేసిన కాసేపటికే ఆ విమానం రాడార్, రేడియో సంప్రదింపులను కోల్పోయింది. విమానంలో ఐదుగురు సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. విమానం అరేబియా సముద్రంపై ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రాథమిక రాడార్, ఫ్లైట్ ట్రాకింగ్ సమాచారం ప్రకారం విమానం చివరి నిమిషాల్లో అసాధారణంగా ఎత్తు మారుస్తూ, వేగంగా కిందకు దిగినట్లు తెలుస్తోంది (K2 Airways Boeing 737 cargo plane).
ఆ విమానం కచ్చితంగా ప్రమాదానికి గురైందా అనే విషయాన్ని అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు (Arabian Sea search operation). ఘటన అనంతరం పాకిస్థాన్ అధికారులు భారీ స్థాయిలో గాలింపు చర్యలు ప్రారంభించారు. పాకిస్థాన్ నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్, వాణిజ్య నౌకలను రంగంలోకి దింపి అరేబియా సముద్రంలో విమానం కోసం వెతుకుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సింగరేణికి తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపు.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎం
రూ.15 విలువైన ఆర్డర్‌కు రూ.500 టిప్పు.. డెలివరీ బాయ్ రియాక్షన్ వీడియో వైరల్